కాంట్రాక్ట్‌ కార్మికులకు ఈఎస్‌ఐ వైద్యం | - | Sakshi
Sakshi News home page

కాంట్రాక్ట్‌ కార్మికులకు ఈఎస్‌ఐ వైద్యం

Aug 29 2025 6:46 AM | Updated on Aug 29 2025 6:46 AM

కాంట్రాక్ట్‌ కార్మికులకు ఈఎస్‌ఐ వైద్యం

కాంట్రాక్ట్‌ కార్మికులకు ఈఎస్‌ఐ వైద్యం

శ్రీరాంపూర్‌: సింగరేణిలో కాంట్రాక్ట్‌ కార్మికులకు రెండు నెలల్లో ఈఎస్‌ఐ వైద్య సదుపాయం కల్పించబోతున్నారని గుర్తింపు సంఘం ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య తెలిపారు. గురువారం నస్పూర్‌ కాలనీలోని సివిల్‌ డిపార్టుమెంట్‌ వద్ద పలువురు కాంట్రాక్ట్‌ కార్మికులు ఏఐటీయూసీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కంపెనీలో 33 వేల మంది కాంట్రాక్ట్‌ కార్మికులు పని చేస్తున్నారని వీరికి కనీస వేతనాలు అందడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో ఆ యూనియన్‌ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి ముస్కే సమ్మయ్య, బ్రాంచి కార్యదర్శి షేక్‌ బాజీసైదా, సహాయ కార్యదర్శి మోతుకూరి కొమురయ్య, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement