
యువకుడు ఆత్మహత్య
జైపూర్: అప్పుల బాధతో యు వకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చోటు చేసుకుంది. మండలంలోని గంగిపల్లి గ్రామానికి చెందిన జలంపల్లి సంపత్(32) కూలీ పనిచేస్తూ కుటుంబాన్ని పోషి స్తున్నాడు. వీరికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాగా నిర్మించుకుంటున్నారు. ఇంటి నిర్మాణం కోసం బంధువుల వద్ద రూ.3 లక్షలు అప్పులు తెచ్చారు. తీ ర్చడం ఎలా అంటూ భార్య సంకీర్తనతో చెప్తూ బాధపడుతుండేవాడు. ఈనెల 26న జైపూర్ వెలిశాల మల్లన్న గుడి సమీపంలో గడ్డి మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. స్థానికుల సమాచారంతో మంచిర్యాలకు, మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ తరలించగా చికిత్స పొందుతూ 27న మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఏఎస్సై బాలయ్య తెలిపారు.
రైలు కిందపడి వృద్ధురాలు..
మంచిర్యాలక్రైం: మనస్తాపంతో రైలు కిందపడి వృద్ధురాలు ఆత్మహత్య చేసుకున్న సంఘటన జిల్లా కేంద్రంలో గురువారం చోటు చేసుకుంది. జీఆర్‌పీ హె డ్ కానిస్టేబుల్ సంపత్ తెలిపిన వివరాల ప్రకారం స్థానిక పాత గర్మిళ్లకు చెందిన వైద్య సత్తమ్మ(78) భర్త చంద్రయ్య, ముగ్గురు కుమారులు, కోడలు కొంతకాలం క్రితం వేర్వేరు కారణాలతో మృతి చెందారు. దీంతో మనస్తాపానికి గురైన వృద్ధురాలు మంచిర్యాల–పెద్దపేట రైల్వేస్టేషన్‌ల మధ్య గుర్తు తెలియని ౖరైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడింది. రెండో కోడలు విజయ ఇచ్చిన ఫిర్యాదు ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాపు చేస్తున్నట్లు జీఆర్‌పీ హెడ్ కానిస్టేబుల్ తెలిపారు.
ఉరేసుకుని ఒకరు..
భైంసాటౌన్: పట్టణంలోని గడ్డెన్నవాగు సమీపంలో చెట్టుకు ఉరేసుకుని ఒకరు ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై నవనీత్ రెడ్డి తెలిపారు. ఇలేగాంకు చెందిన వీరేశ్ సోమవారం కుంటాల మండలం వి ట్టాపూర్‌లోని అత్తగారింటికి వెళ్లాడు. మంగళవారం అక్కడి నుంచి బయలుదేరి వచ్చాడు. సాయంత్రం భార్య ఇంటికి వచ్చినా వీరేశ్ రాకపోవడంతో ఆ చూకీ కోసం వెతికారు. ఫలితం లేకపోవడంతో బు ధవారం గాలింపు చేపట్టడంతో భైంసాలోని గడ్డెన్నవాగు ప్రాజెక్టు సమీపంలో బైక్ కనిపించింది. దీంతో ఆ ప్రాంతంలో వెతకగా చెట్టుకు ఉరేసుకుని కని పించాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని ఏరియాస్పత్రికి తరలించారు. ఇంటి కో సం ఓ ఫైనాన్స్ సంస్థలో రుణం తీసుకున్నాడని, వా రి వేధింపుల కారణంగానే ఆత్మహత్యకు పాల్పడ్డాడని కుటుంబీకులు ఆరోపించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నవనీత్ రెడ్డి తెలిపారు.