
మూడో లైన్ రైల్వే ట్రాక్ ప్రారంభం
బెల్లంపల్లి: బెల్లంపల్లి, రెబ్బెన రైల్వేస్టేషన్ల మధ్య కొంతకాలం క్రితం కొత్తగా చేపట్టిన మూడో లైన్ రైల్వే ట్రాక్ పనులు పూర్తి కావడంతో రైల్వే అధికారులు గురువారం లాంఛనంగా ప్రారంభించారు. దక్షిణ మధ్య రైల్వే కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ(సీఆర్‌ఎస్) మాధవిలత ట్రాక్ పనులు, రైల్వే వంతెనలు పరిశీలించారు. బెల్లంపల్లి రైల్వేస్టేషన్ ఆవరణలో మూడో లైన్ రైల్వే ట్రాక్ మీదుగా రైళ్ల రాకపోకలకు పచ్చ జెండా ఊపి ప్రారంభోత్సవం చేశారు. అనంతరం ఫొటో ఎగ్జిబిషన్‌ను పరిశీలించారు. దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ డీఆర్‌ఎం గోపాలకృష్ణన్, రైల్వే అధికారులు పాల్గొన్నారు.