
మాటలు చెప్పొద్దు.. పనులు చేయాలి
జన్నారం: పనికి రాని మాటలు చెప్పొద్దని, పనులు సకాలంలో పూర్తి చేయాలని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. జన్నారం నుంచి కవ్వాల్ రోడ్డు పనుల్లో ఎందుకు జాప్యం జరుగుతుందని ఆర్‌అండ్‌బీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం స్థానిక మండల పరిషత్ సమావేశ మందిరంలో అధిక వర్షాలు, నష్టాలు, అభివృద్ధి పనులపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆర్‌అండ్‌బీ అధికారులు సమావేశానికి రాకపోవడంతో శాఖ డీఈకి ఫోన్ చేసి గైర్హాజరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కడెం ప్రధాన కాలువ నుంచి కవ్వాల్ రాముని చెరువుకు లిఫ్టు ద్వారా నీరందించేందుకు ప్రతిపాదనలు పూర్తి చేయాలని డీఈ వెంకటేశంను ఆదేశించారు. ఈ సమావేశంలో ఏఎంసీ చైర్మన్ లక్ష్మీనారాయణ, పీఏసీఎస్ చైర్మన్ రవి, వీటీడీవో అధికారి జనార్దన్, తహసీల్దార్ రాజమనోహర్‌రెడ్డి, ఎంపీడీవో ఉమర్ షరీఫ్, తదితరులు పాల్గొన్నారు.