నాణ్యమైన ధాన్యం కొనుగోలు చేయాలి
జైపూర్: జిల్లాలోని కొనుగోలు కేంద్రాల్లో రైతుల నుంచి నాణ్యమైన వరి ధాన్యం కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. మండలంలోని షెట్‌పల్లి, నర్సింగాపూర్, కుందారం, కిష్టాపూర్, పౌనూర్, ఽశివ్వారం, వేలాల గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సోమవారం ఆయ న సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సన్నరకం వడ్లకు మద్దతు ధరతోపాటు రూ.500అదనపు బోనస్ అందిస్తామని తెలిపారు. రైతులకు తాగునీరు, నీడ, ఓఆర్‌ఎస్ సౌకర్యం కల్పించినట్లు తెలిపారు. అనంతరం ఇందారం గ్రామంలో విద్యుత్ సబ్‌స్టేషన్ ఏర్పాటుకు తహసీల్దార్ వనజారెడ్డితో కలిసి స్థలాన్ని పరిశీలించారు.


