జొన్నలు తరలిస్తున్న వాహనాల పట్టివేత
తాంసి: మహరాష్ట్ర నుంచి అక్రమంగా జొన్నలను వాహనాల్లో తరలించి శుక్రవారం తాంసి మార్కెట్‌యార్డులో విక్రయిస్తుండగా పట్టుకున్నట్లు జైనథ్ సీఐ డీ సాయినాథ్ తెలిపారు. సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. కొద్దిరోజులుగా తెలంగాణ మార్కెట్‌లో జొన్నలకు అధిక ధర లభిస్తుండగా మహారాష్ట్రకు చెందిన దళారులు తెలంగాణ రైతుల పట్టాపాస్‌పుస్తకాల పేరిట జిల్లాలోని వివిధ మార్కెట్‌యార్డుల్లో జొన్నలు విక్రయిస్తున్నారు. దీనిపై పక్కా సమాచారం మేరకు సీఐ శుక్రవారం భీంపూర్ ఎస్సైతో కలిసి భీంపూర్ మండలం నిపాని వద్ద తనిఖీలు చేపట్టారు. మహారాష్ట్ర నుంచి జొన్నలతో వస్తున్న ట్రాక్టర్, రెండు బొలెరో వాహనాలను పట్టుకున్నారు. మహారాష్ట్రలోని ఘంటాజీ, జరూర్ నుంచి అక్రమంగా జొన్నలు తరలిస్తున్నట్లు గుర్తించారు. మూడు వాహనాలను పోలీస్‌స్టేషన్‌కు తరలించి ఏవో శ్రీనివాస్‌రెడ్డి, ఏఈవో సాయిప్రసాద్ సమక్షంలో సీజ్ చేసి మహారాష్ట్రకు చెందిన సుశాంత్, దినేశ్, సునీల్, భారత్, గోకుల్‌తోపాటు మార్కెట్‌లో జొన్నల విక్రయానికి పట్టాపాస్ పుస్తకాలు ఇచ్చి సహకరిస్తున్న భీంపూర్ రైతులు నారాయణ, రాథోడ్ అరవింద్, వామన్‌పై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. ఎస్సై పీర్‌సింగ్ నాయక్, సిబ్బంది దినేశ్ ఉన్నారు.


