
‘శ్రీ చైతన్య’ విజయఢంకా
సప్తగిరికాలనీ(కరీంనగర్): ఇంటర్ ఫలితాల్లో కరీంనగర్‌లోని శ్రీచైతన్య జూనియర్ కళాశాల విద్యార్థులు విజయఢంకా మోగించారు. సెకండియర్ ఎంపీసీలో ఆర్.వైష్ణవి 993, లాస్విక 992, జి.శ్రీనిత్య, పి.భరత్‌రెడ్డి, అకిరానందన్ 991 మార్కులు సాధించారు. బైపీసీలో అభ్యుదయ 994, ఎన్.భార్గవి 992, పి.స్ఫూర్తిశ్రీ, బి.రోహిత్ 990 మార్కులు సాధించారు. సీఈసీలో మధుమిత 961, ఎంఈసీ లో ఎం.భానుప్రకాశ్ 951 మార్కులు సాధించారు. ఫస్టియర్ ఎంపీసీలో ఎ.లక్ష్మీహాసిని 468, జి.శ్రీహి త, పి.హాసినిరావు, ఎం.సాత్విక, జి.శ్రీనిధి, కె.మైత్రి 467 మార్కులు సాధించారు. 466పైగా మార్కులు 22మంది, 465 పైగా మార్కులు 14 మంది సాధించారు. బైపీసీలో ఇ.అఖిల, ఔష సినివాసన్ 437, ఎస్.విఘ్న, వి.లహరి, ఆర్.అక్షయశ్రీ, సీహెచ్.కార్తీక్ 436 మార్కులు, ఎంఈసీలో ఎల్.కమలేశ్ 474, సూర మనీష 470, సీఈసీలో హరిణి 492, కె.అంజలి 491 మార్కులు సాధించారు. వీరిని విద్యాసంస్థల అధినేత ముద్దసాని రమేశ్‌రెడ్డి సత్కరించారు. డైరెక్టర్ కర్ర నరేందర్‌రెడ్డి, డీన్ జగన్ మోహన్‌రెడ్డి, ప్రిన్సిపాళ్లు మల్లారెడ్డి, రాఽధాకృష్ణ, మోహన్‌రావు, ఏజీఎం శ్రీనివాస్ పాల్గొన్నారు.