అతివేగంలో రెండు బైక్‌లు ఢీ! యువ‌కుడు.. | - | Sakshi
Sakshi News home page

అతివేగంలో రెండు బైక్‌లు ఢీ! యువ‌కుడు..

Dec 25 2023 12:02 AM | Updated on Dec 25 2023 1:52 PM

- - Sakshi

కంపెల ప్రశాంత్‌ (ఫైల్‌)

మంచిర్యాల: మండలంలోని పోలంపల్లి సమీపంలో మంచిర్యాల–చెన్నూరు జాతీయ రహదారిపై ఆదివారం ఎదురెదురుగా రెండు బైక్‌లు వేగంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా, మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. ఎస్సై రాజవర్ధన్‌ కథనం ప్రకారం.. వేమనపల్లి మండల కేంద్రానికి చెందిన కంపెల ప్రశాంత్‌ (24) మంచిర్యాలకు స్కూటీపై వస్తున్నాడు.

మంచిర్యాల నుంచి కొట్టవాడ మహేశ్‌ బైక్‌పై తన స్వగ్రామమైన మహారాష్ట్రలోని సిరొంచకు వెళ్తుండగా ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ప్రశాంత్‌ అక్కడిక్కడే మృతిచెందగా మహేశ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న ఎస్సై సంఘటన స్థలానికి చేరుకున్నారు. మహేశ్‌ను అంబులెన్స్‌లో మంచిర్యాల ఆసుపత్రికి తరలించారు. ఈమేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
ఇవి చ‌ద‌వండి: అందమైన విద్యార్థినులు క‌నిపించారంటే.. అతడు కీచకుడే! అర్ధరాత్రి..

Advertisement
 
Advertisement
Advertisement