మంచిర్యాల చుట్టూ వంద ఫీట్ల రోడ్డుకు 2012లో మాస్టర్‌ప్లాన్ రూపొందించారు. లక్ష్మీటాకీస్ నుంచి హమాలీవాడకు వెళ్లే దారి మధ్యలో రైల్వేట్రాక్ వరకు ఉన్న భూమిలో ఎలాంటి రోడ్డు వేయవద్దని ఎంసీసీ యాజమాన్యం కోర్టుకు వెళ్లడంతో పనులు నిలిచిపోయాయి. రైల్వే ట్రాక్ ఉండడంతో రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మించాల్సి ఉంది. దీనిపై మంచిర్యాల కార్పొరేషన్ దృష్టి సారించినా ఫలితం ఉండడం లేదు. ఈ రోడ్డును వినియోగంలోకి తీసుకువచ్చి రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి వేస్తే గోపాల్‌వాడ, హమాలీవాడ, రాజీవ్‌నగర్, దొరగారిపల్లె, తిలక్‌నగర్ వెళ్లే టూటౌన్ ప్రజలకు రవాణా భారం తగ్గుతుంది.


