● గుంతలూ పూడ్చరా..! | - | Sakshi
Sakshi News home page

● గుంతలూ పూడ్చరా..!

Aug 7 2026 1:38 AM | Updated on Aug 7 2026 1:38 AM

బెల్లంపల్లి చౌరస్తా నుంచి తెలంగాణ తల్లి విగ్రహం బైపాస్‌ రోడ్డు వరకు 60 ఫీట్ల రహదారి ఉంది. బెల్లంపల్లి చౌరస్తా వద్ద ఓ వ్యక్తి కోర్టుకు వెళ్లడంతో 300 మీటర్ల మేర రోడ్డు పనులు నిలిచిపోయాయి. దీనిపై గతంలోనే పలుమార్లు చర్చలు జరిగినా కొలిక్కి రాలేదు. ఈ ప్రాంతంలోనే ప్రైవేటు ఆసుపత్రులు 30కి పైగా ఉండగా, నిత్యం వేలాది మంది వెళ్తుంటారు. గుంతలు కూడా పూడ్చకపోవడంతో రోగులు, గర్భిణులు వెళ్లలేని పరిస్థితి. భూసేకరణ సమస్య తీర్చి రోడ్డు వేస్తే గౌతమినగర్‌, రాళ్లపేట్‌, బైపాస్‌ రోడ్డు, సంజీవయ్య కాలనీలకు వెళ్లే ప్రజలకు సౌకర్యంగా ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement