బాల్క సుమన్‌కు మద్దతుగా తీర్మానం | - | Sakshi
Sakshi News home page

బాల్క సుమన్‌కు మద్దతుగా తీర్మానం

Oct 6 2023 1:28 AM | Updated on Oct 6 2023 8:33 AM

- - Sakshi

తీర్మానపత్రాన్ని అందజేస్తున్న న్యాయవాదులు

మంచిర్యాల: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌, చెన్నూర్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థికే తమ సంపూర్ణ మద్దతు ఉంటుదని బార్‌ అసోసియేషన్‌ అధ్వర్యంలో ఏకగ్రీవ తీర్మానం చేశారు. గురువారం కోర్టు సముదాయంలో నిర్వహించి సమావేశంలో తీర్మాన పత్రాన్ని ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌కు న్యాయవాదులు అందజేశారు. ఈ సందర్భంగా బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు పొన్నం మల్లేశంగౌడ్‌ మాట్లాడుతూ చెన్నూర్‌ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ గత చరిత్రను తిరిగి రాస్తున్నారని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు చెరుకు సరోత్తంరెడ్డి, న్యాయవాదులు రమేశ్‌ చందర్‌గిల్డా, కమలామనోహార్‌రావు, మద్ది కార్తీక్‌, రవీందర్‌, రమేశ్‌, నిరంజన్‌, రాజ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement