లక్సెట్టిపేట: మండల కేంద్రంలోని ఓ ఫిజియోథెరపీ క్లినిక్‌ను తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సభ్యుడు డాక్టర్ శ్రీనివాస్ శుక్రవారం తనిఖీ చేశారు. అర్హత లేకున్నా ఫిజియోథెరపీ క్లినిక్ నిర్వహిస్తున్నారని సాయిచరణ్ అనే వ్యక్తి అందించిన ఫిర్యాదు మేరకు తనిఖీ నిర్వహించినట్లు తెలిపారు. క్లినిక్‌లో ఫిజియోథెరపీ పేరిట అర్హత లేకున్నా చికిత్స అందిస్తున్నారని, ఇంజెక్షన్‌లు చేస్తూ మందులు ఇస్తున్నారని నిర్ధారించినట్లు పేర్కొన్నారు. నిర్వాహకుడు విజయ్‌కుమార్‌పై చర్యలు తీసుకోవాలని డీఎంహెచ్‌వో, మెడికల్ కౌన్సిల్, విజిలెన్స్ అధికారులకు నివేదిక పంపిస్తున్నట్లు పేర్కొన్నారు. తనిఖీలో కౌన్సిల్ సభ్యులు అనిల్ ముత్తినేని, సంతోష్ చెందూరి పాల్గొన్నారు.


