ఎమ్మెల్యే ఇంటి ఎదుట నిరసన | - | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే ఇంటి ఎదుట నిరసన

Aug 8 2026 1:53 AM | Updated on Aug 8 2026 1:53 AM

పాతమంచిర్యాల: తెలంగాణ మధ్నాహ్న భోజ న కార్మికుల యూనియన్‌ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు ఇంటి ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా యూనియన్‌ జిల్లా అధ్యక్షులు ఎండీ కరీంభీ, ఎండీ రఫియా మాట్లాడారు. మధ్నా హ్న భోజన పథకం నిర్వహణను స్వచ్ఛంద సంస్థలకు అప్పగించవద్దని డిమాండ్‌ చేశారు. పఽథకం 20 ఏళ్లుగా ప్రభుత్వ అదీనంలో కొనసాగుతోందని, అప్పటినుంచి మహిళలు కార్మికులుగా పని చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం ఈ పథకం నిర్వహణ బాధ్యతలు స్వచ్ఛంద సంస్థలకు అప్పగిస్తే కార్మికులు ఉపాధి కోల్పో యి రోడ్డున పడతారని పేర్కొన్నారు. ప్రభుత్వం పునరాలోచించి గతంలో పని చేసిన కార్మి కులనే పథకంలో కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో యూనియన్‌ జిల్లా క మిటీ సభ్యులు మధునమ్మ, సరిత, ఉమ, శంకరమ్మ, భాగ్య, పోశమ్మ, లక్ష్మి, మల్లవ్వ, స్వరూ ప, స్వప్న, రమేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement