రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక కార్యాచరణ ప్రారంభించాం. అరైవ్–అలైవ్ కార్యక్రమం ద్వారా గ్రామాలు, పట్టణాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. రవాణాశాఖ, పోలీస్ అధికారుల సమన్వయంతో విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నాం. రాంగ్ రూట్, మద్యం మత్తు, మితి మీరిన వేగంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయి. తరచుగా ప్రమాదాలు జరిగే స్థలాల వద్ద వేగ నిరోధక ఏర్పాట్లపై జాతీయ రహదారి అధికారులతో మాట్లాడాం. ఆయా అధికారుల సమన్వయంతో బ్లాక్‌స్పాట్‌ల వద్ద సూచిక బోర్టులు ఏర్పాటు చేస్తున్నాం. వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ రూల్స్ పాటించాలి.
– ఎగ్గడి భాస్కర్, డీసీపీ, మంచిర్యాల


