మంచిర్యాలఅగ్రికల్చర్: సీఎంఆర్ డెలివరీని గ డువులోపు పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ రాములు సూచించారు. శుక్రవారం తన చాంబర్‌లో జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి బ్ర హ్మారావు, మేనేజర్ శ్రీకళ, రైస్‌మిల్లర్లతో సీఎంఆర్ డెలివరీపై సమీక్షా సమావేశం నిర్వహించి మాట్లాడారు. లక్ష్యసాధనలో వెనుకబడిన రైస్ మిల్లర్లు సీఎంఆర్ డెలివరీని వేగవంతం చేసి, నిర్దేశిత కార్యాచరణ ప్రకారం పూర్తి చేయాలని, సంబంధిత అధికారులు, మిల్లర్లు సమన్వయంతో పని చేయాలని సూచించారు. సమావేశంలో ఏసీఎస్వో, రైస్‌మిల్లర్లు పాల్గొన్నారు.


