వాహనదారులకు జాగ్రత్తలు
మంచిర్యాలక్రైం: రోడ్డు ప్రమాదాల నివారణకు పో లీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. పెద్దగా ఫలి తం ఉండడం లేదు. నిర్లక్ష్యపు డ్రైవింగ్ ప్రాణాల మీ దకు తెస్తోంది. రాంగ్ రూట్లలో వెళ్లడం, అతివేగం, రోడ్డు క్రాస్ చేయడంలో చిన్నపాటి నిర్లక్ష్యం కారణంగానే చాలా రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. త్వరగా చేరుకోవాలని అతివేగంగా వెళ్తు న్న పలువురు వాహనచోదకులు గమ్యం చేరకుండానే ప్రాణాలు కోల్పోతున్నారు. జిల్లాలో నాలుగేళ్లలో 1,554 ప్రమాదాలు చోటు చేసుకోగా, 467 మంది మృత్యువాత పడడం ఆందోళన కలిగిస్తోంది.
ట్రాఫిక్ రూల్స్ పాటించకనే..
రహదారి భద్రత విషయంలో రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఎప్పటికప్పుడు ఆయా శాఖల అధికారులతో సమన్వయ సమావేశాలు, రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమీక్ష నిర్వహిస్తున్నారు. ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్‌లను గుర్తించి వాటిని సరి చేస్తున్నారు. మద్యం మత్తు, అతి వేగంతో వాహనాలు నడుపుతూ ప్రమాదాల బారిన పడుతున్నారు. ట్రాఫిక్ నియమాలు పాటించని కారణంగా కొందరు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు.
తప్పించుకు తిరుగుతూ..
రోడ్డు ప్రమాదాలను కట్టడి చేయడానికి, ప్రజల భద్రతే లక్ష్యంగా పోలీస్ యంత్రాంగం అనేక చర్యలు తీసుకుంటోంది. డ్రంకెన్ డ్రైవ్, హెల్మెట్ ధరించక పోవడం, రాంగ్ రూట్, ర్యాష్ డ్రైవింగ్, సెల్‌ఫోన్ డ్రైవింగ్, అతివేగం తదితర ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినవారికి జరిమానా విధిస్తోంది. డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుపడుతున్నవారికి జైలు శిక్షలూ పడుతున్నాయి. పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తున్నట్లు తెలిస్తే వెంటనే వేరే రూట్‌లో వెళ్లిపోతున్నా రు. కొన్ని సందర్భాల్లో పోలీసులకు దొరకకుండా తప్పించుకు తిరుగుతున్నారు. అయినప్పటికీ వారు పద్ధతి మార్చుకోవడం లేదు.
జిల్లాలో ఇటీవలి మేజర్ ప్రమాదాలు
2023 నుంచి 2026 జూలై
వరకు రోడ్డు ప్రమాదాల వివరాలు
సంవత్సరం ప్రమాదాలు మృతులు క్షతగాత్రులు
2023 326 111 320
2024 412 132 434
2025 429 136 435
2026 387 88 299


