పెన్‌డౌన్‌, షట్‌డౌన్‌ సమ్మె తాత్కాలిక విరమణ | - | Sakshi
Sakshi News home page

పెన్‌డౌన్‌, షట్‌డౌన్‌ సమ్మె తాత్కాలిక విరమణ

Aug 8 2026 1:53 AM | Updated on Aug 8 2026 1:53 AM

మంచిర్యాలరూరల్‌(హాజీపూర్‌)/పాతమంచిర్యాల: తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని వీబీజీ–రామ్‌ జీ పథకం ఉద్యోగులు వారం రోజులుగా చేస్తున్న పెన్‌డౌన్‌ నిరసన తాత్కాలికంగా విరమించారు. ఈ మేరకు శుక్రవారం తమ నిరసన విరమిస్తున్నట్లు డీఆర్‌డీఓ కిషన్‌కు లేఖను అందజేశారు. వీబీజీ–రామ్‌జీ జేఏసీ ఉద్యోగులు మాట్లాడుతూ పేస్కేల్‌ అమలు హామీతోపాటు తమ న్యాయమైన డిమాండ్లను సెప్టెంబర్‌ 15లోగా పరిష్కరించాలని, లేనిపక్షంలో సెప్టెంబర్‌ 16నుంచి రాష్ట్ర వ్యాప్తంగా శాంతియుత సమ్మెకు సిద్ధమవుతామని తెలి పారు. వీబీజీ–రామ్‌జీ జిల్లా జేఏసీ నాయకులతోపాటు ఏపీఓ మల్లయ్య, ఈసీ శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. కాగా, సమ్మె విరమించి విధుల్లో చేరినట్లు వీబీజీ రామ్‌ జీ ఉద్యోగుల సంఘం జేఏసీ చైర్మన్‌ మునిగంటి రమేశ్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement