నాన్న లే.. బుజ్జగించే నాన్న లేడు.. లాలించే అమ్మ రాదు! | - | Sakshi
Sakshi News home page

నాన్న లే.. బుజ్జగించే నాన్న లేడు.. లాలించే అమ్మ రాదు!

Jun 5 2023 12:54 PM | Updated on Jun 5 2023 4:43 PM

- - Sakshi

తల్లి లేని లోటు పిల్లలకు తెలియకుండా కష్టపడి పని చేస్తు కుటుంబాన్ని నేట్టుకొస్తున్నాడు.

మంచిర్యాల: గతేడాది క్యాన్సర్‌తో తల్లి మృతి చెందగా ఆదివారం అనారోగ్యంతో తండ్రి మృతి చెందాడు. దీంతో ఆ ముగ్గురు చిన్నారులు అ నాథలుగా మిగిలారు. మండలంలోని ముత్తంపేటకు చెందిన లేండుగురే బాపురావ్‌–సత్యబాయి దంపతులకు గోపాల్‌(12), మమత (10), విఘ్నేశ్వర్‌ (8) సంతానం. బాపురావ్‌ (38) హ మాలీ పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. గతేడాది క్యాన్సర్‌తో సత్యబాయి మృతి చెందింది. దీంతో అన్నీ తానై పిల్లలను పెంచుతూ స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తున్నా డు.

తల్లి లేని లోటు పిల్లలకు తెలియకుండా కష్టపడి పని చేస్తు కుటుంబాన్ని నేట్టుకొస్తున్నాడు. హైబీపీతో బాధపడుతున్న బాపురావ్‌కు నాలుగు రోజుల క్రితం సొమ్మసిల్లి పడిపోయాడు. కుడికా లు కూడా పనిచేయకపోవడంతో కుటుంబ సభ్యులు ముందుగా సిర్పూర్‌(టి) ప్రభుత్వ సామాజిక ఆస్పత్రికి అనంతరం అక్కడి వైద్యుల సూచన మేరకు మంచిర్యాలకు తరలించారు. మెరుగైన వైద్యం కోసం వరంగల్‌కు తరలించడంతో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. మెదడులో నరాలు చిట్లి రక్తస్రావం కావడంతో మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.

దీంతో నాన్న ఎప్పుడూ మాతోనే ఉంటాడు అనుకుంటున్న ఆ పిల్లల నమ్మకాన్ని విధి వమ్ము చేసింది. నాన్న లే..అంటూ ముగ్గురు చిన్నారులు తండ్రి మృతదేహంపై పడి రోదించిన తీరు అందర్నీ కలిచి వేసింది. బాధిత కుటుంబాన్ని మాలీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లేండుగురే శ్యాంరావ్‌, ప్రధాన కార్యదర్శి ఆదే వసంత్‌రావ్‌, సర్పంచ్‌ ఆదే శ్రీనివాస్‌ పరామర్శించారు. అనాథలైన చిన్నారులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.

సాయం చేయదలచిన వారి కోసం..

లెండుగురే శంకర్(బాధిత పిల్లల పెద్ద నాన్న..)
బ్యాంక్ అకౌంట్ నంబర్..79031387643
IFSC. SBINORRDCB
తెలంగాణ గ్రామీణ బ్యాంక్ , ముత్తామ్ పెట్..
ఫోన్ పే, గూగులే పే.. 7732031811

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement