● ఫైనల్‌కు చేరిన
ఉమ్మడి జిల్లా బాలబాలికల జట్లు
● ఉత్సాహంగా సాగిన మ్యాచ్‌లు
● నేడు ముగియనున్న రాష్ట్రస్థాయి అండర్–17 టోర్నీ
క్రీడాకారిణులను పరిచయం చేసుకుంటున్న జిల్లా ఎస్‌జీఎఫ్ కార్యదర్శి వేణుగోపాల్, మహబూబ్‌నగర్–ఆదిలాబాద్ బాలుర సెమీఫైనల్ మ్యాచ్
మహబూబ్‌నగర్ క్రీడలు: జిల్లాకేంద్రంలో జరుగుతున్న స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్–17 రాష్ట్రస్థాయి హ్యాండ్‌బాల్ టోర్నమెంట్‌లో ఆతిథ్య ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా బాలబాలికల జట్లు మెరుగైన ప్రతిభ కనబరిచి ఫైనల్‌కు చేరాయి. మహబూబ్‌నగర్ హై స్కూల్, హీరా మోడల్ స్కూల్ ఆవరణలో మ్యాచ్‌లు జరుగుతున్నాయి. శనివారం జరిగిన బాలుర విభాగం సెమీఫైనల్ మ్యాచ్‌లో జిల్లా జట్టు 16–6 గోల్స్ తేడాతో ఆదిలాబాద్ జట్టుపై విజయం సాధించింది. మరో సెమీస్‌లో వరంగల్ జట్టు 16–10 గోల్స్ తేడాతో రంగారెడ్డిపై గెలుపొందింది. బాలికల సెమీఫైనల్ మ్యాచ్‌లో మహబూబ్‌నగర్ 12–3 గోల్స్ తేడాతో నిజామాబాద్‌పై, మరో సెమీస్‌లో ఆదిలాబాద్ 15–3 గోల్స్ తేడాతో కరీంనగర్‌జట్టుపై గెలుపొందాయి.
లీగ్ మ్యాచ్‌ల వివరాలు...
బాలుర విభాగం లీగ్ మ్యాచ్‌లో మహబూబ్‌నగర్ జట్టు 10–8 గోల్స్ తేడాతో రంగారెడ్డి జట్టుపై గెలుపొందింది. మిగతా మ్యాచుల్లో నల్లగొం జట్టు 10–8 గోల్స్ తేడాతో మెదక్‌పై, ఆదిలాబాద్ జట్టు 12–5 గోల్స్ తేడాతో ఖమ్మంపై, కరీంనగర్ జట్టు 15–7 గోల్స్ తేడాతో నిజామాబాద్‌పై, నల్లగొండ జట్టు 16–3 గోల్స్ తేడాతో ఖమ్మంపై, వరంగల్ జట్టు 11–9 గోల్స్ తేడాతో ఆదిలాబాద్‌పై, రంగారెడ్డి జట్టు 13–10 గోల్స్ తేడాతో కరీంనగర్‌పై, హైదరాబాద్ జట్టు 14–13 గోల్స్ తేడాతో నిజామాబాద్‌పై గెలుపొందాయి.


