ప్రాజెక్టులు పూర్తిచేసి మా నీళ్లు మాకే ఇవ్వాలి | - | Sakshi
Sakshi News home page

ప్రాజెక్టులు పూర్తిచేసి మా నీళ్లు మాకే ఇవ్వాలి

Nov 15 2026 1:32 PM | Updated on Nov 15 2026 1:32 PM

కల్వకుర్తి రూరల్‌: ఉమ్మడి పాలమూరు జిల్లాలో పెండింగ్‌ ప్రాజెక్టులు పూర్తిచేసి మా నీళ్లు మాకే ఇవ్వాలని పాలమూరు పెండింగ్‌ ప్రాజెక్టుల సాధన జేఏసీ చైర్మన్‌ రాజేందర్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. శనివారం పట్టణంలోని లయన్స్‌ భవనంలో కల్వకుర్తి జేఏసీ చైర్మన్‌ సదానందంగౌడ్‌ అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాలమూరు మీదుగా కష్ణానది 300 కిలోమీటర్లు ప్రవహిస్తున్నప్పటికీ 80ఏళ్లుగా జిల్లా రైతాంగం సాగు, తాగునీళ్ల కోసం హరిగోస పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. డిండి ప్రాజెక్టు పేరుతో మా భూములు ముంచొద్దని.. మాణీలు తీసుకపోవద్దు.. మా రైతాంగం పొట్ట కొట్టొద్దని కోరారు. దశాబ్దాలు గడుస్తున్న ప్రభుత్వాలు మారుతున్న, పాలకులు మారుతున్న ఉమ్మడి పాలమూరు జిల్లా రైతుల బతుకులు మారడం లేదని ఆవేదన చెందారు. ఉమ్మడి ఏపీలో పాలమూరు జిల్లా కరువుల జిల్లా, వలసల జిల్లాగా చేసి నీళ్ల పంపిణీలో తీవ్ర అన్యాయం చేశారని ఒక కన్వీనర్‌ రాఘవాచారి చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో ఒకవిధమైన అన్యాయం జరిగితే తెలంగాణలో నల్గొండ జిల్లా రాజకీయ నేతలు ఆధిపత్య ధోరణితో పాలమూరు జిల్లా రైతుల పొట్టకొట్టేలా డిండి ప్రాజెక్టు పేరుతో నీళ్ల దోపిడీకి తెరలేపారని ఆందోళన వ్యక్తం చేశారు. పాలమూరు జిల్లా రైతుల పక్షాన ఉద్యమించేందుకు ఏ రాజకీయ పార్టీ కూడా ముందుకు రాలేని దుస్థితిలో ఉన్నాయని విమర్శించారు. తాము చేసిన ఆందోళనతో ప్రజాప్రతినిధులలో చలనం వచ్చిందన్నారు. ఉమ్మడి జిల్లా ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇప్పటికై నా పాలమూరు జిల్లా రైతాంగానికి జరుగుతున్న అన్యాయాన్ని సరిచేసి న్యాయం చేయా లని రాఘవాచారి డిమాండ్‌ చేశారు. సమావేశంలో ముంపు గ్రామాల రైతులు పర్వతాలు, ప్ర కాష్‌, పెద్దగౌడ్‌, రాజు, అర్జున్‌రెడ్డి, భూపేష్‌ చారి, గోవర్ధన్‌రెడ్డి, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement