కళాశాల సిబ్బంది తొందర పాటు నిర్ణయంతో మరో విద్యార్థి ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

కళాశాల సిబ్బంది తొందర పాటు నిర్ణయంతో మరో విద్యార్థి ఆత్మహత్య

Nov 15 2026 1:32 PM | Updated on Nov 15 2026 1:32 PM

అమీర్‌పేట: చైన్నెస్‌ అమ్రిత హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కళాశాల ప్రిన్సిపాల్‌, లెక్చరర్‌ వేధింపులతో ఓ విద్యార్ధి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మరిచి పోకముందే బల్కంపేటలోని ఓ కళాశాల సిబ్బంది తొందరపాటు నిర్ణయంతో మరో విద్యా ర్థిని ఆత్మహత్య చేసుకుంది. ఎస్‌ఆర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో శనివారం జరిగిన సంఘటన వివరాలు పోలీసులు తెలిపిన ప్రకారం ఈ విధంగా ఉన్నాయి. వనపర్తి జిల్లా శ్రీరంగాపురం మండలకేంద్రానికి చెందిన హర్షియా సుల్తానా (16) బల్కంపేటలోని 9 ఎడ్యుకేషన్‌ ఐఐటీ అకాడమీలో ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతుంది. కళాశాల భవనంలోనే ఉన్న హాస్టల్‌లో ఉంటున్న హర్షియా శనివారం ఉదయం ఎప్పటిలాగే కళాశాలకు వెళ్లింది. మధ్యాహ్నం ఓ యువకుడు వచ్చి ఆమెతో మాట్లాడుతుండగా కళాశాల సిబ్బంది గమనించి హర్షియాను పిలిచి ఆతడు ఎవరని అడుగగా తన సోదరుడని చెప్పడంతో కళాశాల సిబ్బంది వెంటనే తల్లిదండ్రులకు ఫోన్‌ మీ కూతురు ఓ వ్యక్తితో మాట్లాడుతుందని, అడిగితే సోదరుడని చెప్పిందని తెలిపారు. ఆమెకు సోదరులు ఎవరు లేరని, ఫోన్‌ ఆమెకు ఇవ్వాలని చెప్పడంతో కళాశాల సిబ్బంది బాలికకు ఫోన్‌ ఇచ్చారు. ఫోన్లో తల్లి తీవ్రంగా మందలించడంతో మనస్తాపం చెందిన హర్షియా 3వ అంతస్తులోని 307 హాస్టల్‌ గదిలోకి వెళ్తూ డోర్‌ గట్టిగా మూసివేసింది. పెద్దగా శబ్దం రావడంతో గది బయట ఉన్న రూమ్‌మెంట్స్‌ తలుపులో తట్టారు. లోపలి నుంచి గడియ వేసి ఉండటంతో కిటికీలో నుండి చూడగా హర్షియా చున్నీతో ఉరి వేసుకుని కనిపించింది. హాస్టల్‌ సిబ్బంది సాయంతో తలుపులు విరగొట్టి హర్షియాను కిందకు దింపి అమీర్‌పేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. కాగా అప్పటికే బాలిక మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సంఘటన స్థలానికి వచ్చిన ఎస్‌ఆర్‌నగర్‌ పోలీసులు కేసు నమోదు చేసి ఆత్మహత్యకు గల కారణాలపై విచారణ ప్రారంభించారు. తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చామని, వారు వచ్చాక ఆత్మహత్యకు గల కరణాలు తెలుస్తామని పోలీసులు తెలిపారు. మృతదేహన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement