మహబూబ్‌నగర్ క్రీడలు: వికారాబాద్‌లో శనివారం ముగిసిన రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ కబడ్డీ పోటీల్లో మహబూబ్‌నగర్ జిల్లా బాలుర జట్టు మెరుగైన ప్రతిభ కనబరిచింది. ఈ పోటీల్లో జిల్లా జట్టు ఫైనల్ మ్యాచ్‌లో మేడ్చల్ జట్టుపై విజయం సాధించి చాంపియన్‌గా నిలిచింది. విజేతగా నిలిచిన బాలుర జట్టును జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు బి.శాంతికుమార్, ప్రధాన కార్యదర్శి కురుమూర్తిగౌడ్, సభ్యులు ముత్యం గురుస్వామి, రాంచంద్రయ్య, దామోదర్‌రెడ్డి, బాల్‌రాజు, కె.నర్సింహులు, ఆర్.శ్రీనివాసులు, పాపారాయుడు, గణేష్ తదితరులు అభినందించారు. రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో విజేతగా నిలవడం సంతోషంగా ఉందని, భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించాలని వారు ఆకాంక్షించారు.


