మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: పీయూ పీజీ కళాశాలను వీసీ శ్రీనివాస్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈమేరకు విద్యార్థులతో మాట్లాడిన ఆయన వారి అటెండెన్స్, తరగతుల్లో విద్యాబోధనపై ఆరా తీశారు. వసతులు, సౌకర్యాలపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. మార్కులు సాధించడమే లక్ష్యం కాకుండా విషయ పరి/్ఞానం పెంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ మధుసూదన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పీయూ వీసీని కలిసిన
సామరామ్మోహన్‌రెడ్డి
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: పీయూ వీసీ శ్రీనివాస్‌ను టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామరామ్మోహన్‌రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రామ్మోహన్‌రెడ్డి మాట్లాడుతూ రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తన పేరును ఖరారు చేసిందని, తనకు సహకారం అందించాలని కోరారు. అలాగే కాంట్రాక్టు అధ్యాపకులతో మాట్లాడగా ప్రభుత్వం భర్తీ చేస్తున్న పోస్టుల్లో కాంట్రాక్టు అధ్యాపకులను భర్తీ చేసిన అనంతరం మిగిలిన పోస్టులను భర్తీ చేయాలని వారు కోరగా సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. అంతకు ముందు పీయూ నాన్‌టీచింగ్ సంఘం నాయకులు రామ్మోహన్ తదితరులు సామ రామ్మోహన్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. తమను రెగ్యులరైజ్ చేయాలని కోరారు. సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.


