నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ | - | Sakshi
Sakshi News home page

నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ

Nov 16 2026 1:02 AM | Updated on Nov 16 2026 1:02 AM

జెడ్పీసెంటర్‌ (మహబూబ్‌నగర్‌): జిల్లాలోని నిరుద్యోగ యువతకు అమరరాజా ఈఎస్‌ఎస్‌సీఐ ఆధ్వర్యంలో ఉపాధి రంగాల్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు సంస్థ సెంటర్‌ మేనేజర్‌ ఆనంద్‌కుమార్‌ ఆదివారం ఒక ప్రకనటలో తెలిపారు. ఎలక్ట్రీషియన్‌, ఎలక్ట్రిక్‌ వెహికిల్‌ సర్వీస్‌, ఏసీ టెక్నీషియన్‌ రంగాల్లో 90 రోజులపాటు ఉచిత శిక్షణ ఇవ్వనునట్లు చెప్పారు. పూర్తి వివరాల కోసం సెల్‌ నంబర్లు 73034 44397, 73034 44561లను సంప్రదించాలని సూచించారు.

‘మా భూములు

మాకు ఇప్పించండి’

● బూరెడ్డిపల్లి రైతుల విజ్ఞప్తి

జడ్చర్ల టౌన్‌: ఏళ్లతరబడి జీవనాధారంగా ఉన్న అసైన్డ్‌భూమి 45 ఎకరాలను తిరిగి తమకే ఇప్పించాలని మండలంలోని బూరెడ్డిపల్లి గ్రామానికి చెందిన రైతులు ప్రభుత్వాన్ని కోరారు. రైతులు నర్సింహులు, శాంతయ్య, కృష్ణయ్య, నాగరాజు, జంగమ్మ, యాదగిరి తమ భూముల విషయంలో రాష్ట్ర భూ పరిపాలన ప్రధాన కమిషనర్‌కు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. ఈ మేరకు ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పూర్తి వివరాలు వెల్లడించారు. తమ పూర్వికులు మాదిగ నాగయ్య కుటుంబానికి ప్రభుత్వం గతంలో భూమిని ప్రభుత్వం అసైన్డ్‌ చేసిందని, దానిని అప్పటి నుంచి సాగు చేసుకుంటూ ప్రస్తుతం 50 కుటుంబాలు జీవనం గడుపుతున్నామని పేర్కొన్నారు. అయితే ఇటీవల కొందరు రెవె న్యూ అధికారుల సహకారంతో పూర్వికుల పే ర్లు తొలగించి ఇతరుల పేర్లపై మార్చారని వా పోయారు. దీనిపై 2022లో హైకోర్టులో పిటిష న్‌ దాఖలు చేశామని, స్పందించిన హైకోర్టు స ర్వే నంబర్లు 102/1, 102/2, 102/3లో ఉన్న 45 ఎకరాల భూమి రెవెన్యూ రికార్డుల్లో మా ర్పు చేయరాదని, అమ్మకాలు, కొనుగోళ్లు జరపరాదని స్టేటస్‌కో ఉత్తర్వులు జారీ చేసినట్లు ఫిర్యాదులో పొందుపర్చామన్నారు. కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ కొన్ని సంస్థలు, వ్యక్తుల పేర్లపైకి భూమిని మార్చారని, దీనిపైన రిట్‌ పిటిషన్‌ వేయగా సమగ్ర విచారణ జర్పాలని కలెక్టర్‌, తహసీల్దార్‌లను హైకోర్టు ఆదేశించిందన్నారు. డిసెంబర్‌ 5లోగా రెవెన్యూ అధికారులు తమ సమస్యకు పరిష్కారం చూపకపోతే మరుసటి రోజు నుంచి పాదయాత్ర నిర్వహిస్తామని, పెద్దఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను సుప్రీంకోర్టు న్యాయవాది గాలి వినోద్‌కుమార్‌ తెలియజేయగా, న్యాయవాదులు దానక్క, గోవింద్‌, సురేష్‌బాబు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement