కోతుల బెడద నివారణకు చర్యలు | - | Sakshi
Sakshi News home page

కోతుల బెడద నివారణకు చర్యలు

Nov 13 2026 4:05 AM | Updated on Nov 13 2026 4:05 AM

జడ్చర్ల: పట్టణంలో కోతుల బెడద నివారణకు చర్యలు చేపట్టినట్లు ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి తెలిపా రు. గురువారం శ్రీరాంనగర్‌, శాంతినగర్‌, రైల్వేస్టేషన్‌, పాతబజార్‌ తదితర ప్రాంతాల్లో గుంపులుగా సంచరిస్తున్న కోతులను బోన్లలో బంధించారు. పట్టుకున్న కోతులను పరిశీలించిన ఎమ్మెల్యే.. వాటికి అరటిపండ్లు ఆహారంగా అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కోతుల బెడదపై ప్రజ ల నుంచి అనేక ఫిర్యాదులు వస్తున్నాయని, దీంతో వాటిని పట్టుకుని అటవీ ప్రాంతాలకు తరలించేలా చర్యలు చేపట్టామన్నారు. కోతులను దేవుడితో సమానంగా భావించి పూజిస్తామని, వాటిని చంపడం నేరమన్నారు. అయితే కోతులు ఇళ్లలోకి చొరబడుతూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని, ముఖ్యంగా పిల్లలు, మహిళలను భయాందోళనకు గురిచేస్తున్నాయని తెలిపారు. రాజాపూర్‌ మండలం చెన్నవెల్లి తదితర గ్రామాల్లోనూ కోతుల బెడద తీవ్రంగా ఉందని, అక్కడ కూడా నివారణ చర్యలు చేపడతామన్నారు. తొలి విడతలో సుమారు 350 కోతులను పట్టుకున్నామని, కలెక్టర్‌, మున్సిపల్‌, అటవీశాఖ అధికారుల అనుమతులతో నిబంధనల ప్రకారం వాటిని సురక్షితంగా అడవుల్లో వదిలేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. మున్సిపల్‌ కమిషనర్‌ గిరీష్‌కుమార్‌, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు అశోక్‌యాదవ్‌, మాజీ మార్కెట్‌ వైస్‌ చైర్మన్‌ రాజేందర్‌గౌడ్‌, నాయకులు యాదయ్య, వెంకటేశ్‌, శ్యామ్‌, రమేశ్‌, రఘు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement