నాగులపల్లి వాసి రవిప్రకాశ్‌రావుకు కీర్తి పురస్కారం | - | Sakshi
Sakshi News home page

నాగులపల్లి వాసి రవిప్రకాశ్‌రావుకు కీర్తి పురస్కారం

Nov 13 2026 4:05 AM | Updated on Nov 13 2026 4:05 AM

కోడేరు: మండలంలోని నాగులపల్లికి చెందిన ప్రముఖ కవి, రచయిత, సాహితీ విమర్శకులు సంబరాజు రవిప్రకాశ్‌ రావుకు సురవరం ప్రతాప్‌రెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారం ప్రకటించింది. ఈ సందర్భంగా తెలంగాణ సారస్వత పరిషత్‌ సభ్యులు వేదార్థం మధుసూదన్‌శర్మ, తెలుగు భారతి సాహితీ సంస్థ అధ్యక్షుడు ఆమని కృష్ణ, కవి, రచయిత, తెలుగు భాషోపాధ్యాయులు డా. గూడెలి శివయ్య మాట్లాడుతూ.. సంబరాజు రవిప్రకాష్‌ తెలకపల్లి రామచంద్రశాస్త్రి జీవిత చరిత్ర, కేశవ పంతులు జీవిత చర్రిత, ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా ఆత్మకథలు, జీవిత చరిత్రలు, సంబరాజు శతకం వంటి రచనలు చేశారన్నారు. వేముగంటి నరసింహాచార్యులు రచించిన తిక్కన కావ్యానికి వ్యాఖ్యానం, వానమామలై వరదాచార్యులు రచించిన రామాయణానికి వ్యాఖ్యా నం చేసి కవిగా, రచయితగా, విమర్శకుడిగా, వ్యాఖ్యాన కర్తగా తెలుగు సాహిత్య చరిత్రలో గొప్ప స్థానాన్ని సంపాదించకున్నారని కొనియాడారు. వారి సాహితీ కృషిని గుర్తించి, తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారం ప్రకటించడం కొల్లాపూర్‌ ప్రాంతానికి గర్వకారణమన్నారు. హర్షం ప్రకటించిన వారిలో కవులు, రచయితలు డా.పంద్రప్రగడ రామచంద్రారావు, వేముల కోటయ్య, మెనావత్‌ రామదాసు నాయక్‌, ముమ్మ డి చంద్రశేఖరాచారి తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement