● ఆరు గ్యారంటీల అమలులోకాంగ్రెస్ విఫలం: ఎంపీ డీకే అరుణ
పాలమూరు: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతి నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు ఇప్పటి నుంచే పనిచేయాలని ఎంపీ డీకే అరుణ పిలుపునిచ్చారు. జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి అధ్యక్షతన బుధవారం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పదాధికారులు, ఆఫీస్ బేరర్స్ సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సీఎం నియోజకవర్గంతో పాటు ఏడుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ ప్రజలు బీజేపీని ఆదరించారని పేర్కొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభు త్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ వైఫల్యాలపై పోరాడటంతో పా టు కేంద్ర నిధులతో గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధిని ప్రజలకు వివరించాలని సూచించారు. తె లంగాణకు కేంద్రం 2 లక్షల ఇళ్లను మంజూరు చేసినప్పటికీ అర్హులకు కాకుండా కాంగ్రెస్ కార్యకర్తలకు కేటాయిస్తున్నారని ఆరోపించారు. కొడంగల్‌లో రోడ్ల విస్తరణ పేరుతో నష్టపరిహారం ఇవ్వకుండా ఇళ్లను కూల్చివేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావాలంటే ప్రతి బూత్‌లో పార్టీని బలోపేతం చేయాలని రాష్ట్ర సంస్థాగత కార్యదర్శి మధుకర్, ప్రధాన కార్యదర్శి గౌతంరావు సూచించారు. ప్రజా సమస్యలపై క్షేత్రస్థాయిలో పోరాటాలు చేయాలని, కాంగ్రెస్ చేస్తున్న ఓటు చోరీ ఆరోపణలను తిప్పికొట్టాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. నేతలు పద్మజా రెడ్డి, అంజయ్య, నంబిరాజు, బాలరాజు, నాగేశ్వర్‌రెడ్డి, డోకూర్ పవన్‌కుమార్‌రెడ్డి, ఎగ్గని నర్సింహులు, రమేష్, పాండురంగారెడ్డి, సాహితీరెడ్డి పాల్గొన్నారు.
మాట్లాడుతున్న ఎంపీ డీకే అరుణ


