కేజీబీవీల అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి | - | Sakshi
Sakshi News home page

కేజీబీవీల అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి

Nov 11 2026 1:19 AM | Updated on Nov 11 2026 1:19 AM

జెడ్పీసెంటర్‌(మహబూబ్‌నగర్‌): సాంఘిక సంక్షేమ వసతి గృహాలు, కస్తూర్భాగాంధీ బాలికా విద్యాలయాల్లో ఇప్పటికే మంజూరైన అన్ని అభివృద్ధి పనులను ఎలాంటి జాప్యం లేకుండా త్వరితగతిన పూర్తి చేయాలని అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌నాయక్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో డిప్యూటీ డైరెక్టర్‌ (ఎస్సీ సంక్షేమం), కేజీబీవీ ప్రత్యేక అధికారులతో సమీక్షించారు. మంజూరైన పనుల పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని, క్షేత్రస్థాయిలో పనుల నాణ్యతను పరిశీలించాలని ఆదేశించారు. పనుల అమలులో ఎదురవుతున్న సమస్యలను వెంటనే పరిష్కరించి, విద్యార్థులకు మెరుగైన వసతి, మౌలిక సదుపాయాలు కల్పించేలా మరమ్మతులు, అభివృద్ధి పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. పెండింగ్‌లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేసేలా సంబంధిత శాఖల అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. విద్యార్థులు ఉతికిన దుస్తులను ఆరబెట్టుకునే సమయంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, వారి సౌకర్యార్థం క్లాత్స్‌ క్లిప్స్‌ను పంపిణీ చేశారు. సమావేశంలో జిల్లా షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధి శాఖ అధికారిణి సునీత, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement