అయిజ: హైదరాబాద్‌లోని గచ్చిబౌలి బాలయోగి స్టేడియంలో మంగళవారం నిర్వహించిన తెలంగాణ ప్రీమియర్ లీగ్ అండర్–10 విభాగం 100 మీటర్ల పరుగు పందెంలో అయిజ పట్టణానికి చెందిన అక్కాచెల్లెళ్లు ప్రతిభ చాటారు. ఈ పోటీల్లో ఆర్.రూపశ్రీ బంగారు పతకం సాధించగా, ఆర్. అన్విక వెండి పతకాన్ని కై వసం చేసుకుంది. గత నెలలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లోనూ ఈ చిన్నారులు సత్తాచాటారు. స్కేటింగ్, రన్నింగ్, లాంగ్‌జంప్ విభాగాల్లో మూడేసి బంగారు పతకాలు సాధించి జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఇదిలా ఉండగా, అయిజ పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న రాబర్ట్ 70వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు ఎంపికయ్యారు.


