ట్రాక్టర్‌ కింద పడి మహిళా కూలీ మృతి | - | Sakshi
Sakshi News home page

ట్రాక్టర్‌ కింద పడి మహిళా కూలీ మృతి

Nov 11 2026 1:25 AM | Updated on Nov 11 2026 1:25 AM

చిన్నచింతకుంట: వరికోత పనులకు వెళ్లిన ఓ మహిళా ట్రాక్టర్‌ కింద పడి మృతిచెందిన ఘటన చిన్నచింతకుంట మండలం కురుమూర్తిలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. మద్దూర్‌కు చెందిన సత్యమ్మ (51) అదే గ్రామానికి చెందిన రాజుయాదవ్‌ పొలానికి వరికోత పనుల నిమిత్తం పనులకు వెళ్లింది. అయితే మధ్యాహ్నం వరికోత పనులు నిలిపి కోత మిషన్‌ డ్రైవర్‌, ట్రాక్టర్‌ డ్రైవర్‌ భోజనానికి వెళ్లారు. సత్యమ్మ అక్కడే వేచి చూస్తూ ట్రాక్టర్‌ వెనుక భాగంలో ట్రాక్టర్‌ ట్రాలీ నీడలో నిద్రించింది. భోజనానికి వెళ్లి వచ్చిన ట్రాక్టర్‌ డ్రైవర్‌ హరికృష్ణ నిద్రించిన సత్యమ్మను గమనించకుండా ట్రాక్టర్‌ను వెనకకు తోలాడు. దీంతో సత్యమ్మపై ట్రాక్టర్‌ టైర్‌ ఎక్కి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే కుటుంబ సభ్యులు సత్యమ్మను జిల్లా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతిచెందింది. చిన్నచింతకుంట ఎస్‌ఐ గోకరిని వివరణ కోరగా తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని వివరించారు.

అప్పుల బాధతో

యువకుడి బలవన్మరణం

వనపర్తి రూరల్‌: మండలంలోని కడుకుంట్ల గ్రామానికి చెందిన నక్క లక్ష్మినారాయణ(42) సోమవారం మృతిచెందాడు. ఎస్‌ఐ హృషికేశ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. కుటుంబ అవసరాల కోసం చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక కొంతకాలంగా ఆయన ఆందోళనకు గురవుతున్నాడు. ఈ క్రమంలో సోమవారం తిరుమలయ్యగుట్టకు వెళ్లే మార్గంలోని అటవీ ప్రాంతంలో పురుగు మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఘటనపై మృతుడి భార్య నక్క యాదమ్మ మంగళవారం వనపర్తి రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వెల్లడించారు.

చికిత్స పొందుతూ యువకుడు మృతి

ఉండవెల్లి: మండలంలోని మారమునగాల–2 గ్రామానికి చెందిన వినోద్‌కుమార్‌ (31) చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం.. వినోద్‌కుమార్‌ కొంతకాలంగా మద్యానికి అలవాటు పడటంతో ఈ నెల 6న కుటుంబ సభ్యులతో గొడవపడ్డాడు. ఈ క్రమంలో ఇంట్లో పురుగుల మందు తాగడంతో కుటుంబ సభ్యులు గుర్తించి వెంటనే కర్నూలులోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి తల్లి పద్మజ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ సురేష్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement