కొత్తకోట రూరల్: జిల్లాలో ఆయిల్‌పాం సాగు చేస్తు న్న రైతులకు మరింత ప్రయోజనం చేకూర్చేలా ఆ యిల్‌పాం ఫ్యాక్టరీ నిర్మాణం జరుగుతోందని, పను లు నాణ్యవంతంగా, వేగంగా పూర్తి చేయాలని రాష్ట్ర ఉద్యానశాఖ సంచాలకులు షేక్‌యాస్మిన్‌బాషా అధికారులను ఆదేశించారు. వనపర్తి జిల్లా కొత్తకోట మండలంలోని సంకిరెడ్డిపల్లి శివారులో నిర్మిస్తున్న ఆయిల్‌పాం ఫ్యాక్టరీ పనుల పురోగతిని శుక్రవారం రాష్ట్ర ఉద్యానశాఖ సంచాలకులు షేక్‌యాస్మిన్‌బాషా అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఫ్యాక్టరీ నిర్మాణానికి సంబంధించిన ప్రస్తుత స్థితిగతులను ఫ్రీ యూనిక్ ఆయిల్‌పాం కంపెనీ ప్ర తినిధులను అడిగి తెలుసుకున్నారు. 2027 మార్చి నాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని పూ ర్తి చేయాలని కంపెనీ ప్రతినిధులకు సూచించారు. జిల్లాలో ఇప్పటికే 6,700 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ఆయిల్‌పాం సాగవుతున్నందున ఫ్యాక్టరీ అందుబాటులోకి వస్తే పెద్ద సంఖ్యలో రైతులకు ప్రయో జనం చేకూరుతుందన్నారు. రైతులు తమ తోటల్లో పండించిన ఆయిల్‌పాం గెలలను (ఎఫ్‌ఎఫ్‌బీ) స్థా నికంగానే విక్రయించుకోవడానికి, రవాణా ఇబ్బందులను తగ్గించుకోవడానికి ఈ ఫ్యాక్టరీ ఎంతో దోహదపడుతుందన్నారు. అనంతరం ఆయిల్‌పాం రైతులతో ఆమె ముఖాముఖి మాట్లాడి.. ఎకరానికి ఎంత మేర దిగుబడి వస్తోందని, పంట ద్వారా రైతులకు లభిస్తున్న ఆదాయం, సాగులో ఎదురవుతున్న సమస్యల గురించి ఆరా తీశారు. కార్యక్రమంలో జిల్లా ఉద్యానశాఖ అధికారి విజయభాస్కర్, ఆయిల్‌పాం సీఈఓ సత్యనారాయణ, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు కె.బుచ్చన్న, ఉపాధ్యక్షుడు హరీశ్‌రెడ్డి, అధికారులు ఉన్నారు.


