వేరుశనగ విత్తనాలు అందలేదని కలెక్టరేట్‌ ఎదుట ధర్నా | - | Sakshi
Sakshi News home page

వేరుశనగ విత్తనాలు అందలేదని కలెక్టరేట్‌ ఎదుట ధర్నా

Oct 23 2026 12:33 AM | Updated on Oct 23 2026 12:33 AM

వనపర్తి రూరల్‌: ఇటీవల ప్రభుత్వం అందించిన ఉచిత వేరుశనగ విత్తనాలు అర్హులైన మహిళా సంఘాలకు కాకుండా బుక్క్‌కీపర్‌ ఇష్టారీతిగా పంపిణీ చేశారని ఖిల్లాఘనపురం మండలంలోని ఉప్పర్‌పల్లి మహిళా సంఘాల సభ్యులు గురువారం వనపర్తి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించి డీఆర్‌డీఓ ఉమాదేవికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మా గ్రామంలో 27 సంఘాలు ఉన్నాయని, ఎవరికి కూడా సమాచారం ఇవ్వకుండా బుక్‌ కీపర్‌ ఇష్టారీతిగా వేరుశనగ విత్తనాలు 13మందికి పంపిణీ చేసిందని, అర్హులైన వారికి ఇవ్వకుండా అనర్హులకు ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఈనెల 19న మండల, గ్రామ సమాఖ్య ఆధ్వర్యంలో వేరుశనగ విత్తనాల గురించి సమావేశం నిర్వహించి, 13మందితో ఈనెల 22 వరకు రికవరీ చేయాలని తీర్మానించినట్లు వారు తెలిపారు. ధాన్యం సెంటర్లలో జరిగిన అవకతవకలను విచారించి చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం నుంచి వచ్చే రూ.10లక్షల లోనుకు 3వేలదాక తీసుకుంటున్నారు. ఎందుకు ఇంత తీసుకుంటున్నారని ఏపీఎంను ప్రశ్నించగా మీరు సమావేశాలకు వచ్చినప్పుడు భోజనాలు పెట్టడానికి సరిపోతాయని సమాధానం చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్న పథకాలు మా దగ్గరకు రాకుండా చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. బుక్‌ కీపర్లపై చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయాలని డీఆర్‌డీఓను కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement