ఆకుముడత.. ఇలా నివారిద్దాం | - | Sakshi
Sakshi News home page

ఆకుముడత.. ఇలా నివారిద్దాం

Oct 23 2026 12:33 AM | Updated on Oct 23 2026 12:33 AM

అలంపూర్‌ : జిల్లాలో సాగైన వరి పంట ప్రస్తుతం పిలకల దశలో ఉంది. ఈ దశలో పంటకు ఆకుముడత ఆశించే అవకాశాలు అధికంగా ఉంటాయి. వరి పైరును తీవ్ర నష్టాలు కలుగజేసే కీటకాల్లో ఆకుముడత పురుగు ఒకటి. ఈ పురుగు నారు మడి దశ నుంచి ఈనె, పాలు పోసుకోనే దశ వరకు పైరును ఆశించి భారీ నష్టాన్ని మిగుల్చుతుందని మండల వ్యవసాయ శాఖ అధికారి నాగార్జున రెడ్డి సూచించారు. అయితే ఈ జాగ్రత్తలు తీసుకుంటే ఆకుముడతను నివారించవచ్చని వివరించారు.

నష్టపరిచే విధానం :

లార్వా దశలోని గొంగళి పురుగులు ఆకులను గీకి ఆకుపచ్చని పదార్థాన్ని తింటాయి. తర్వాత ఆకు చివర అంచులకు చేరుతాయి. లాలజలంతో చుట్టవలె చుట్టుకుంటాయి. లోపల ఆకులోని జీవ పదార్ధం, పత్ర హరితాన్ని గోకి తింటాయి. క్రమేపి దుబ్బులోని చాలా ఆకులను నష్టపరుస్తాయి. వరి పంట దిగుబడికి పూత దశ తర్వాత జరిగే కిరణజన్య సంయోగ క్రియ చాలా ముఖ్యం. ఈ సమయంలో జరిగే సంయోగక్రియ మీదనే 60 నుంచి 70 శాతం దిగుబడి ఆధారపడుతుంది. అయితే ఆకుముడత పురుగుల తీవ్రత వలన ఆకులు పూర్తిగా తెల్లబడతాయి. దీంతో పిండి పదార్థం తయారుకాక వెన్నులు, గింజలు లేకుండా మారుతాయి. ఫలితంగా దిగుబడి అధిక మొత్తంలో తగ్గిపోతుంది. ఈ పురుగు మూడు తరాలు గడిపి పంటను నష్టపరుస్తుంది. చిరు పొట్ట దశలో రెండవ తరం గొంగళి పురుగులు ఎక్కువగా కనిపిస్తాయి. రెండవ తరంలో కీటకాల తాకిడి తగ్గడానికి గాను మొదటి తరంలో అంటే నారు వేసిన 25–30 రోజుల మధ్య సస్యరక్షణ చేపడితే అదుపు చేయవచ్చును. అలా కాకుండా నత్రజని ఎరువులు ఎక్కువగా వాడితే ఈ పురుగుల తాకిడి మరింత ఎక్కువ అవుతుంది.

పాడి–పంట

సస్యరక్షణ చర్యలు ఇలా..

పైరు మీద రెక్కల పురుగులు అధిక సంఖ్యలో ఎదుగుతున్నట్లు కనిపిస్తే వేప నూనె (1500 పీపీఎమ్‌) ఎకరాకు 800 మి.లీ 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. దీని వలన పురుగు గుడ్లు రెక్కల పురుగులు చాలా వరకు నిర్మూలించవచ్చు. అలాగే ఎకరానికి 400 మి.లీ ప్రొఫినోఫాస్‌ అనే మందును 200 లీటర్ల నీటిలో కలిపి పంట మీద పిచికారీ చేసుకున్నా పురుగును సమర్థవంతంగా అరికట్టవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement