జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): పండుగ సాయన్న దొరల ఆరాచకాలకు వ్యతిరేకంగా పోరాడాడిన యోధుడు అని ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. సాయన్న 174వ జయంతి సందర్భంగా గురువారం మహబూబ్‌నగర్ పద్మావతికాలనీలో ఆయన విగ్రహానినికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆనాటి నిజాం ప్రభుత్వ హయాంలో భూస్వాములు, దొరల అరాచకాలకు వ్యతిరేకంగా పోరాడిన ధీరుడు పండుగ సాయన్న అని కొనియాడారు. పేదలు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి విశేషంగా కృషి చేశారని పేర్కొన్నారు. బడుగు బలహీన వర్గాల తెలంగాణ రాబిన్‌హుడ్‌గా పండుగ సాయన్న ప్రజల హృదయాల్లో నిలిచిపోయారని అన్నారు. సాయన్న పోరాట స్ఫూర్తి, సామాజిక స్పృహ నేటి యువతకు మార్గదర్శకంగా నిలవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ముడా చైర్మన్ లక్ష్మణ్‌యాదవ్, రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, డీఆర్‌ఓ నిర్మల తదితరులు పాల్గొన్నారు.
ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచాడు
మహబూబ్‌నగర్ క్రైం: పేదలు, అణగారిన వర్గాల పక్షాన నిలిచిన పండుగ సాయన్న ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారని ఎస్పీ డి.జానకి అన్నారు. గురువారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో పండుగ సాయన్న చిత్రపటానికి ఎస్పీ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సొంత ప్రాంతమైన పాలమూరు జిల్లాకు చెందిన ఇలాంటి మహనీయుల చరిత్రను భావితరాలకు తెలియజేయడం, వారి ఆశయాలను స్మరించుకోవడం మనందరి బాధ్యత అని అన్నారు. పేదల సంక్షేమం, సామాజిక న్యాయం పట్ల ఆయన చూపిన నిబద్ధత నేటి తరానికి స్ఫూర్తిదాయకమన్నారు. కార్యక్రమంలో ఏఆర్ అదనపు ఎస్‌పీ సురేష్‌కుమార్, ఏఓ రుక్మిణిబాయ్, ఎస్‌బీ ఇన్స్‌పెక్టర్ మోతీరామ్, ఆర్‌ఐ అడ్మిన్ కృష్ణయ్య పాల్గొన్నారు.


