ఏడు నెలలు గడుస్తున్నా.. | - | Sakshi
Sakshi News home page

ఏడు నెలలు గడుస్తున్నా..

Oct 23 2026 12:57 AM | Updated on Oct 23 2026 12:57 AM

మాది మాగనూరు. నా భర్త బచ్చి దేవేంద్రప్ప(32) ఏడు నెలల క్రితం పొలం దగ్గర విద్యుత్‌ మరమ్మతులు చే స్తుండగా..ఆకస్మికంగా కరెంట్‌ షాక్‌కు గురై అక్కడిక్కడే మరణించాడు. అయితే నా భర్త పేరు మీద ఒక ఎక రం పొలం ఉంది. నేను రైతు బీమా కోసం ఏడు నె లల క్రితం సంబంధిత వ్యవసాయ అధికారుల దగ్గ ర దరఖాస్తు చేసుకున్నా.. ఇప్పటివరకు పరిహారం అందలేదు. దీంతో భర్తను కోల్పోయిన తాను ఆర్థి కంగా ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పుకొచ్చారు.

– అంజలి, మాగనూర్‌, నారాయణపేట జిల్లా

చనిపోయిన రైతుల వివరాలు

సేకరిస్తున్నాం..

రైతు బీమా ప్రభుత్వం ప్రీమియం చెల్లించకపోవడంతో ఆగిపోయింది. అందుకే బీమాకు అర్హులైన రైతులు చనిపోయినా పరిహారం రావడం లేదు. ఉన్నతాధికారులు చనిపోయిన రైతుల వివరాలు నమోదు చేసుకోండని సమాచారం ఇవ్వడంతో చేస్తున్నాం. రెండు నెలలో జిల్లా 150 మంది రైతు బీమా అర్హులైన రైతులు వివిధ కారణాల వల్ల చనిపోయారు. వారికి పరిహారం ఎలా ఇస్తారో మాకు సమాచారం లేదు.

– యశ్వంత్‌రావు, డీఏఓ, నాగర్‌కర్నూల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement