జడ్చర్ల: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్‌యార్డులో గురువారం ధాన్యానికి రికార్డుస్థాయి ధర లభించింది. ధాన్యం ఆర్‌ఎన్‌ఆర్ రకానికి సంబంధించి క్వింటా ధర రూ.3,016 దక్కింది. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు ఇంతధర పలకడం ఇదే మొదటిసారి. అయితే యార్డుకు ధాన్యం రాక గణనీయంగా పడిపోవడంతో ధరలు పెరుగుతున్నాయి. కాగా..మొక్కజొన్న క్వింటా గరిష్టంగా రూ.2,971, కనిష్టంగా రూ.2,501, రాగులు రూ.3,110, మినుములు రూ.8,801 ధరలు లభించాయి.
పల్లీ క్వింటా రూ.8,542
గద్వాలవ్యవసాయం: జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌యార్డుకు గురువారం 81 క్వింటాళ్ల వేరుశనగ విక్రయానికి వచ్చింది. క్వింటాకు గరిష్టంగా రూ. 8,542, కనిష్టంగా రూ. 5,169, సరాసరి రూ. 7,320 ధరలు లభించాయి. అలాగే 30 క్వింటాళ్ల ఆముదాలు రాగా.. క్వింటాకు గరిష్టంగా రూ. 7,969, కనిష్టంగా రూ. 7,809, సరాసరి రూ.7,959 ధరలు పలికాయి.


