కిక్కిరిసిన పాలమూరు బస్టాండ్‌ | - | Sakshi
Sakshi News home page

కిక్కిరిసిన పాలమూరు బస్టాండ్‌

Oct 23 2026 12:57 AM | Updated on Oct 23 2026 12:57 AM

నగరం నుంచి హైదరాబాద్‌ బస్సు ఎక్కడానికి బారులుతీరిన ప్రయాణికులు

దసరా పండుగ ముగియడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రజలు గురువారం తిరుగు ప్రయాణమయ్యారు. ఈనెల 9 నుంచి 22వ తేదీ వరకు ప్రభుత్వం పండుగ సెలవులు ఇచ్చిన విషయం విదితమే. దీంతో చాలా మంది స్వగ్రామాలకు వచ్చారు. ఇప్పుడు పాఠశాలలు, కళాశాలలకు తిరిగి హాజరయ్యేందుకు బస్సుల్లో కిక్కిరిసిపోయారు. జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండు ఉదయం నుంచి రాత్రి వరకు ప్రయాణికులతో కిటకిటలాడింది. ఆర్టీసీ అధికారులు అదనపు బస్సులు ఏర్పాటు చేసినప్పటికీ రద్దీ తగ్గలేదు. ముఖ్యంగా హైదరాబాద్‌, నాగర్‌కర్నూల్‌, నారాయణపేట, తాండూరు తదితర మార్గాల్లో ప్రయాణికుల తాకిడి ఎక్కువగా కనిపించింది. కాగా, ప్రయాణికుల సౌకర్యార్థం ఈనెల 26వ తేదీ వరకు అదనపు బస్సులు నడుపుతామని ఆర్టీసీ అధికారులు ప్రకటించారు. – మహబూబ్‌నగర్‌ మున్సిపాలిటీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement