రైతు ప్రాణం పోయినా.. అందని సాయం
● నిలిచిపోయిన రైతుబీమా పథకం
● రూ.5 లక్షల సాయం కోసం బాధితుల ఎదురుచూపులు
● ఉమ్మడి జిల్లాలో 501 కుటుంబాలకు అందని రూ.25.05 కోట్ల పరిహారం
● కొత్తగా వచ్చే ఇందిరమ్మ బీమాపై ఆశలు.. పాత బాధితుల్లో ఆందోళన
నాగర్‌కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలం కొత్తరాంనగర్ గ్రామానికి చెందిన గుర్రపు పాండుయాదవ్(39) ఆగస్టు 20న రాత్రి పొలంలో పత్తి పంటకు నీరు పెట్టడానికి వెళ్లగా అకస్మాత్తుగా గుండెనొప్పి రావడంతో చనిపోయాడు.ఇతనికి నాలుగు ఎకరాల పొలం ఉంది. కూలిన పాత ఇళ్లు ఉండగా..ఇంటి ఆవరణలోనే రేకులు వేసుకొని కుటుంబం జీవనం సాగిస్తుంది. భార్య పద్మ, ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు. వ్యవసాయం, ఇతర అవసరాల కోసం రూ.7లక్షల అప్పు ఉందని మృతుడి భార్య పద్మ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం రూ.5లక్షల పరిహారం ఇచ్చి ఆదుకోవాలని వేడుకుంటున్నారు.
నాగర్‌కర్నూల్: కుటుంబానికి పెద్దదిక్కుగా ఉన్న రైతు మరణిస్తే ఆ ఇంటి కష్టాలు రెట్టింపవుతాయి. పంటల కోసం చేసిన అప్పులు, పిల్లల చదువులు, కుటుంబ పోషణ భారంగా మారతాయి. అలాంటి సమయంలో అండగా నిలిచే రైతుబీమా ఇప్పుడు నిలిచిపోవడంతో బాధిత కుటుంబాలకు భరోసా కరువైంది. రైతు మరణిస్తే అందే రూ.5 లక్షల పరిహారం కోసం వందలాది కుటుంబాలు ఎదురుచూస్తున్నాయి. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో పథకం నిలిచిపోయిన తర్వాత మరణించిన 501 మంది రైతుల కుటుంబాలకు రూ.25.05 కోట్ల పరిహారం అందాల్సి ఉంది. మరోవైపు, బీమా అమల్లో ఉన్నప్పుడే రైతులను కోల్పోయిన కుటుంబాలకూ సాయం అందలేదు. నవంబర్ 19న ఇందిరమ్మ కుటుంబ బీమా అమలవుతుందన్న నేపథ్యంలో పాత బాధితులకు పరిహారం ఎలా అందిస్తారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
జోగుళాంబ గద్వాల
108
నారాయణపేట
76
65
వనపర్తి
ఎనిమిదేళ్లుగా అండగా
గత ప్రభుత్వంఎనిమిదేళ్ల క్రి తం రైతుబీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. 18–59 ఏళ్ల వ యసున్న అర్హులైన రైతులకు ప్రభు త్వమే ప్రీమియం చెల్లించేది. ఏటా ఆగస్టు 14న ఎల్‌ఐసీకి ప్రీమియం చెల్లించి పాలసీ ని పునరుద్ధరించేది. రైతు మరణిస్తే నామినీ ఖాతాలో రూ.5 లక్షలు జమయ్యేవి. సాధారణంగా వారం నుంచి పది రోజుల్లో పరిహారం అందడంతో బాధిత కుటుంబాలకు తక్షణ ఆర్థిక సాయం లభించేది. అయితే ఈ ఏడాది ఆగస్టు 14న ప్రీమియం చెల్లించకపోవడంతో పథకం నిలిచిపోయింది. దీంతో ఆ తర్వాత మరణించిన అర్హులైన రైతుల కుటుంబాలకు పరిహారం అందని పరిస్థితి ఏర్పడింది.


