స్టేషన్ మహబూబ్‌నగర్: శ్రీఅన్నమయ్య వాణి లలిత సంగీత విద్యాలయం ఆధ్వర్యంలో జిల్లాకేంద్రం పద్మావతీకాలనీలోని గాయత్రి ఫంక్షన్‌హాల్‌లో శుక్రవారం నుంచి ఈనెల 29 వరకు శ్రీవనమాలి పాదపద కవిత తాత సంకీర్తనా షష్టమ వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ప్రముఖ ఆధ్యాత్మిక గాయకులు గద్వాల చంద్రశేఖరరావు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆయా రోజుల్లో సాయంత్రం 5.30 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు సంకీర్తనలు ఆలపించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ షష్టమ సంకీర్తనా వారోత్సవాలను వైభవంగా నిర్వహించడానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
24న ఉమ్మడి జిల్లా
క్రికెట్ ఎంపికలు
మహబూబ్‌నగర్ క్రీడలు: జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని మినీ స్టేడియంలో ఈనెల 24వ తేదీన స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్–19 విభాగం బాలబాలికల ఉమ్మడి జిల్లాస్థాయి క్రికెట్ ఎంపికలు జరుగుతాయని అండర్–19 ఉమ్మడి జిల్లా ఎస్‌జీఎఫ్ కార్యనిర్వాహక కార్యదర్శి వేణుగోపాల్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు ఆధార్‌కార్డు, బోనఫైడ్, ఎస్‌ఎస్‌సీ మెమోతో ఆ రోజు ఉదయం 10 గంటలకు మినీ స్టేడియంకు చేరుకోవాలని ఆయన సూచించారు.
పెండింగ్ ప్రాజెక్టులు
పూర్తి చేయాలి
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): ఉమ్మడి పాలమూరు జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలని ఉమ్మడి పాలమూరు పెండింగ్ ప్రాజెక్టుల సాధన జేఏసీ జిల్లా చైర్మన్ రాజేందర్‌రెడ్డి డిమాండ్ చేశారు. పండుగ సాయన్న స్ఫూర్తితో గురువారం పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలని లక్ష సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలమూరు–రంగారెడ్డి నీళ్లు డిండి పేరుతో నల్లగొండకు తరలించే కుట్రలను తిప్పి కొట్టాలన్నారు. లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ నిర్మించాలని, చంద్రసాగర్, అమ్రాబాద్ లిఫ్ట్ చేపట్టాలని కోరారు. కృష్ణ, బీమా నదుల సంగం తంగిడి నుంచి 72 జీఓ వేమరకు భారీ ఎత్తిపోతల పథకం చేపట్టాలని కోరారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు నిధుల వరద పారించి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. పోరాటాల వీరుడు పండుగ సాయన్న స్ఫూర్తితో పాలమూరు ప్రాజెక్టులపై పోరాటం చేస్తామన్నారు. ఇందుకోసం లక్ష సంతకాల సేకరణ మహోద్యమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. ఈ నెల 22వ తేదీ నుంచి నవంబర్ 30వ తేదీ వరకు ఈ సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు వివరించారు. కార్యక్రమంలో ప్రాజెక్టుల సాధన జేఏసీ నాయకులు రాఘవాచారి, లక్ష్మీకాంత్, చెన్నికిష్టన్న, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.


