ఉండవెల్లి: ఆగి ఉన్న బైక్ను వెనుక నుంచి అతివేగంగా వచ్చిన కారు ఢీకొట్టడంతో రెండున్నరేళ్ల బాలుడు మృతి చెందిన ఘటన గురువారం మండలంలో చోటుచేసుకుంది. కర్నూలు జిల్లా జూపాడుబంగ్లా మండలంలోని తాటిపాముల గ్రామానికి చెందిన కురుమన్న, శివమణిి దంపతులు తమ ఇద్దరు చిన్నారులు నిషిత్కుమార్, హర్షసాయితో కలిసి దసరా పండుగకు తల్లిగారి గ్రామం గద్వాల జిల్లాలోని దౌదర్పల్లికి వచ్చారు. ఈ క్రమంలో పండుగ ముగించుకొని గురువారం స్వగ్రామైన తాటిపాములకు బైక్పై బయలుదేరారు. ఈ క్రమంలో వారు ఉండవెల్లి శివారులోని జాతీయ రహదారిపై బ్యాటరీ చార్జింగ్ స్టేషన్ ఎదురుగా బైక్ ఆపి నీరు తాగుతుండగా వెనుక నుంచి కర్నూలుకు వెళ్తున్న కారు ఢీకొట్టడంతో బైక్పై ఉన్న కుటుంబ సభ్యులు చెల్లాచెదురుగా ఎగిరిపడ్డారు. బాలుడు నిషిత్కుమార్ పరిస్థితి విషమంగా ఉండడంతో కారులో అత్యవసర చికిత్స నిమిత్తం కర్నూలుకు తరలిస్తుండగా.. మార్గమధ్యలో మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. కురుమన్నకు కాలు ప్యాక్చర్ కావడంతో 108లో కర్నూలుకు తరలించారు. శివమణి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి, వివరాలు సేకరించారు.
● బైక్ను వెనుక నుంచి ఢీకొట్టిన కారు
● రెండున్నరేళ్ల చిన్నారి మృతి


