ఆయకట్టుకు నిరంతరం నీరివ్వాలి | - | Sakshi
Sakshi News home page

ఆయకట్టుకు నిరంతరం నీరివ్వాలి

Oct 23 2026 12:33 AM | Updated on Oct 23 2026 12:33 AM

కొల్లాపూర్‌ రూరల్‌: ‘మా సూచన ఆచరణ సాధ్యం.. విజ్ఞతతో ఆలోచించి అమలు చేయండని’ మంత్రి జూపల్లి కృష్ణారావుకు మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి సలహ ఇచ్చారు. గురువారం కొల్లాపూర్‌ మండలంలోని కుడికిళ్ల సమీపంలో పాలమూరు ప్రాజెక్టు ప్రధాన కాల్వకు అడ్డంగా ఉన్న తండు (మట్టి దిబ్బ)ను, నార్లాపూర్‌ రిజర్వాయర్‌ తూంను మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేఎల్‌ఐ పంపులు 24 గంటలు నడపాలని, నార్లాపూర్‌ రిజర్వాయర్‌ అనుసంధాన తూం ద్వారా కేఎల్‌ఐకి నీళ్లిచ్చి చివరి ఆయకట్టు రైతులను ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. మూడేళ్లుగా పాలమూరు ప్రాజెక్టును పడావ్‌ పెట్టారని ధ్వజమెత్తారు. కేసీఆర్‌ 6.5 టీఎంసీల నీటి లభ్యతతో నార్లాపూర్‌ రిజర్వాయర్‌ నిర్మాణం చేసి, 2023 సెప్టెంబర్‌లోనే ఒక పంపు ప్రారంభించి 4 టీఎంసీల నీటిని రిజర్వాయర్‌లోకి ఎత్తిపోసినట్లు గుర్తుచేశారు.

జూపల్లి సవాల్‌ను స్వీకరిస్తా..

మంత్రి కృష్ణారావు ఇటీవల పాలమూరు తూం నుంచి నీటిని విడుదల చేస్తూ నార్లాపూర్‌ రిజర్వాయర్‌ నుంచి కాల్వల ద్వారా నీటిని దిగువకు ఎలా తీసుకుపోవాలో బీఆర్‌ఎస్‌ నాయకులు చెప్పాలని విసిరిన సవాల్‌ను స్వీకరిస్తున్నామని పేర్కొన్నారు. రెండు పంపుల సామర్థ్యానికి సరిపోయేలా తుండును తొలిగిస్తే గ్రావిటీ ద్వారా ఏదుల, వట్టెం, కర్వెన రిజర్వాయర్లకు నీళ్లు తరలించవచ్చని ప్రభుత్వానికి సలహ ఇచ్చారు. నీళ్లు సహజంగానే దిగువకు పారుతాయని, కానీ మంత్రి జూపల్లిలా పార్టీలు మారే స్వభావం నీటికి ఉండదని ఎద్దేవా చేశారు. నార్లాపూర్‌లో 10 పంపులు ఒకేసారి ప్రారంభిస్తే 26 వేల క్యూసెక్కుల నీటిని ఈ కాల్వ ద్వారా పారించొచ్చన్నారు.

‘పాలమూరు’ను మూడేళ్లుగా పడావ్‌ పెట్టారు

కేఎల్‌ఐ పంపులు 24 గంటలు నడపాలి

మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి డిమాండ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement