డివైడర్‌ను ఢీకొట్టిన బైక్‌.. యువకుడి మృతి | - | Sakshi
Sakshi News home page

డివైడర్‌ను ఢీకొట్టిన బైక్‌.. యువకుడి మృతి

Oct 23 2026 12:33 AM | Updated on Oct 23 2026 12:33 AM

వనపర్తి రూరల్‌: పట్టణంలోని చింతల హనుమాన్‌ ఆలయం సమీపంలో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మరణించగా మరో యువకుడికి తీవ్రగాయాలయ్యాయి. వివరాల్లోకి వెళ్తే.. మెంటేపల్లికి చెందిన దినేష్‌, పెబ్బేరుకు చెందిన గణేష్‌ ఇద్దరు కలిసి బైక్‌పై వస్తుండగా ద్విచక్రవాహనం అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ప్రమాదంలో దినేష్‌ తలకు తీవ్ర గాయాలై మృతి చెందగా గణేష్‌కు గాయాలవకడంతో హైదరాబాద్‌లోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న ఎమ్మేల్యే తూడి మేఘారెడ్డి గురువారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి మృతదేహానికి నివాళ్లులర్పించి మృతుని కుటుంబసభ్యులను పరామర్శించారు. అలాగే గణేష్‌ కుటుంబసభ్యులను ఫోన్‌లో పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కుటుంబానికి అండగా నిలవాల్సిన కుమారుడు అకాల మృతి చెందడం అత్యంత బాధకరమని ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.

కుటుంబసభ్యులకు ఎమ్మేల్యే పరామర్శ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement