డీఎస్సీ–2002 ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

డీఎస్సీ–2002 ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి

Oct 2 2026 12:52 AM | Updated on Oct 2 2026 12:52 AM

మహబూబ్‌నగర్‌ మున్సిపాలిటీ: డీఎస్సీ– 2002 లో అన్‌ట్రెయిన్డ్‌ ఉపాధ్యాయులుగా ఎంపికై 2003 మార్చి నుంచి విధుల్లో చేరిన వారు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని టీపీసీసీ అధికార ప్రతినిధి గాల్‌రెడ్డి హర్షవర్ధన్‌రెడ్డి కోరారు. ఈ మేరకు గురువారం హైదరాబాద్‌లో విద్యాశాఖ కమిషనర్‌ నికోలస్‌, డైరెక్టర్‌ ఆఫ్‌ ట్రెజరీస్‌ అండ్‌ అకౌంట్స్‌ పార్వతీదేవిలకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అప్పట్లో గ్రామపంచాయతీల పరిధిలో పనిచేసిన కాలాన్ని సర్వీసులో కలపాలన్నా రు. ఎంపికై న నాటి నుంచి రెగ్యులరైజ్‌ చేయాలన్నారు. 2006 జనవరి నుంచి సీపీఎస్‌ ప్రాన్‌ ఖాతాలలో జమైన మొత్తాన్ని జీపీఎఫ్‌లోకి మా ర్చాలన్నారు. కార్యక్రమంలో నాయకులు చాగంటి ప్రభాకర్‌, కె.శ్రీనివాస్‌, దసురునాయక్‌, రజిత, సంపూర్ణ, శిరీష్‌ పాల్గొన్నారు.

మనస్తాపంతో భర్త ఆత్మహత్య

కందనూలు: భార్యాభర్తల మ ధ్య గొడవ కారణంగా పురుగు ల మందు తాగిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఎస్‌ఐ వెంకట్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. బిజినపల్లి మండలం మహదేవునిపేట గ్రామానికి చెందిన రమేష్‌ (32) జిల్లాకేంద్రంలో కొన్నేళ్లుగా కారు డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ నెల 28న భార్యాభర్తల మధ్య గొడవ జరగడంతో మనస్తాపానికి గురైన రమేష్‌ పురుగుల మందు తాగాడు.దీంతో కుటుంబసభ్యులు అతడిని జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. మృతుడి కి భార్య, కుమారుడు ఉన్నారు. మృతుడి తండ్రి తిరుపతయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమో దు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement