మహబూబ్‌నగర్ క్రైం: తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడమీలో ఐదు రోజులుగా నిర్వహిస్తున్న తెలంగాణ రాష్ట్ర పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్–2026లో జిల్లా పోలీస్ సిబ్బంది వివిధ క్రీడ విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. బ్యాడ్మింటన్ డబుల్స్ విభాగంలో ఏఆర్ హెడ్‌కానిస్టేబుల్ లింగం, టూటౌన్ హెడ్‌కానిస్టేబుల్ శేఖర్‌లు రజత పతకం సాధించారు. అదేవిధంగా లాన్ టెన్నిస్ డబుల్స్ విభాగంలో ఏఆర్ హెడ్‌కానిస్టేబుల్ ఇమ్రాన్, లింగం కాంస్య పతకం సాధించారు. క్రీడల్లో ప్రతిభ కనబరిచిన క్రీడకారులను జిల్లా ఎస్పీ డి.జానకి అభినందించారు.


