ప్రతి సంవత్సరం సరైన వర్షాలు లేక తిర్మలాపురం, గూడూరు గ్రామ చెరువులకు నీరు చేరడం లేదు. అంతేగాక ఆరుతడి పంటలకు నీరు అందించలేకపోతున్నాం. రైతులు తీవ్ర నష్టాలకు గురవుతున్నారు. ప్రభుత్వం చేపట్టిన కోయిల్‌సాగర్ ఎడమ కాల్వ పొడిగింపు పనులను త్వరగా పూర్తిచేసి, చెరువులను నీటితో నింపాలి. రైతుల పంట పొలాలకు సాగునీరు అందించేలా చర్యలు చేపట్టాలి.
– రామ్మోహన్‌రెడ్డి, రైతు, తిర్మలాపురం
కోయిల్‌సాగర్ ప్రాజెక్టు ఎడమ కాల్వ పనులను వేగవంతం చేశాం. ఇప్పటికే 4 కి.మీ. వరకు పనులు పూర్తయ్యాయి. మిగిలిన పనులను ముమ్మరంగా కొనసాగిస్తున్నాం. త్వరలోనే కాల్వ పనులను పూర్తిచేసి, రైతులకు సాగునీరు అందేలా చర్యలు తీసుకుంటాం.
– హరినాథ్‌రెడ్డి, ఏఈఈ, ఇరిగేషన్‌శాఖ
●


