శరవే‘గంగా’.. | - | Sakshi
Sakshi News home page

శరవే‘గంగా’..

Oct 2 2026 12:52 AM | Updated on Oct 2 2026 12:52 AM

చిన్నచింతకుంట: కోయిల్‌సాగర్‌ ప్రాజెక్టు ఎడమ కాల్వ పొడిగింపు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. కౌకుంట్ల మండలం రాజోళి వరకు ఉన్న కాల్వను చిన్నచింతకుంట మండలం గూడూరు చె రువు వరకు 8 కి.మీ. మేర పొడిగించేందుకు ప్రభు త్వం రూ. 35.92 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులతో ఇప్పటికే 4 కి.మీ. మేర కాల్మ నిర్మాణం పూర్తయింది. మరో 4 కి.మీ. మేర కాల్వ నిర్మాణం కొనసాగుతోంది. ఈ పనులు పూర్తయితే గూడూరు వరకు సాగునీరు అందనుంది.

రైతుల్లో చిగురిస్తున్న ఆశలు..

ప్రస్తుతం కోయిల్‌సాగర్‌ ఎడమ కాల్వ నిర్మాణం రాజోళి నుంచి దాసర్‌పల్లి వరకు 2 కి.మీ., తిర్మలాపురం నుంచి దాసర్‌పల్లి గ్రామ శివారు వరకు 2 కి.మీ. వరకు పూర్తయింది. మిగతా పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఆ పనులు పూర్తయితే కౌకుంట్ల మండలంలోని దాసర్‌పల్లి, తిర్మలాపురం, చిన్నచింతకుంట మండలంలోని గూడూరు గ్రామ చెరువులకు కోయిల్‌సాగర్‌ ప్రాజెక్ట్‌ నుంచి నీరు చేరనుంది. అంతేగాక అప్పంపల్లి, వెంకటగిరి, దాసర్‌పల్లి, తిర్మలాపురం తదితర గ్రామాల్లోని 8వేల ఎకరాలకు కాల్వల ద్వారా సాగునీరు అందనుంది. తద్వారా ఆయా గ్రామాల రైతులకు సాగునీటి తిప్పలు తీరనున్నాయి. ప్రాజెక్టు నీటిని వ్యవసాయ అవసరాలకు వినియోగించుకునే అవకాశం ఏర్పడతుండటంతో రైతుల్లో ఆశలు నెలకొన్నాయి. పనులను త్వరగా పూర్తిచేసి, సాగునీటిని అందుబాటులోకి తీసుకురావాలని రైతులు కోరుతున్నారు.

కోయిల్‌సాగర్‌ ఎడమ కాల్వ

పొడిగింపు పనులు ముమ్మరం

రూ.35.92 కోట్లతో నిర్మాణ పనులు

ఇప్పటికే 4 కి.మీ.మేర పూర్తి

మరో 4 కి.మీ. కాల్వ నిర్మాణంతో గూడూరు వరకు అందనున్న

సాగునీరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement