మరికల్: బీసీలు అధికారమే లక్ష్యంగా ముందుకు సాగాలని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. బీసీల రాజ్యధికార యాత్ర గురువారం ధన్వాడ నుంచి మరికల్ చౌరస్తాకు చేరుకుంది. ఈ సందర్బంగా కర్నల్ మీటింగ్‌లో ఆయన మాట్లాడుతూ అగ్రకులాల నాయకులపై విమర్శలు చేశారు. ఎదుగుతున్న బీసీలను చంపడం అగ్రకులాలకు తెలిసినంత ఎవరికి తెలియదన్నారు. ఆత్మగౌరవంతో బీసీలు ఏకమైతే తెలంగాణలో బీసీల రాజ్యం వస్తుందని అప్పుడు తెలంగాణలో రెడ్డిలకు చెందిన చివరి సీఎం రేవంత్‌రెడ్డే అవుతాడన్నాడు. అలాగే రెడ్ల ఓట్లు బీసీలకు వద్దని.. బీసీల ఓట్లతోనే మన విజయానికి నాంది పడుతుందన్నారు. బీసీలు ఎవరికి పడకుండా బీసీ నాయకులకు మద్దతు తెలుపాలని పిలుపునిచ్చారు.
బీసీలు రాజ్యాధికారం సాధించాలి
ధన్వాడ: బీసీలు రాజ్యాధికారం సాధించే వరకు తన పోరాటం ఆగదని ఎమ్మెల్సీ మల్లన్న అన్నారు. గురువారం ధన్వాడ మండల కేంద్రం నుంచి పా దయత్ర కొనసాగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నారాయణపేట జిల్లాలో 80శాతం బీసీలు ఉండగా ఎమ్మెల్యే, ఎంపీలు మాత్రం రెడ్డిలు ఉన్నారన్నారు. ఇప్పటికై నా బీసీలందరూ ఏకమై రాజ్యాధికారం కోసం ఉద్యమించాలని కోరారు.


