నాణేల సేకరణకు అంతర్జాతీయ గుర్తింపు | - | Sakshi
Sakshi News home page

నాణేల సేకరణకు అంతర్జాతీయ గుర్తింపు

Oct 3 2026 12:56 AM | Updated on Oct 3 2026 12:56 AM

స్టేషన్‌ మహబూబ్‌నగర్‌: జిల్లా కేంద్రానికి చెందిన నాణేల సేకరణకర్త, విద్యుత్‌శాఖ ఉద్యోగి డీఆర్‌వీ ప్రసాద్‌రావుకు అంతర్జాతీయ అవార్డు దక్కింది. హైదరాబాద్‌లోని తెలంగాణ సారస్వత పరిషత్‌లో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్‌ రాంచందర్‌నాయక్‌ చేతుల మీదుగా ఇంటర్నేషనల్‌ పీస్‌ అండ్‌ ఎక్స్‌లెన్స్‌ టాలెంట్‌ అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా ప్రసాద్‌రావు మాట్లాడుతూ.. వంశీ ఈవెంట్స్‌, మౌర్డ్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఈ అవార్డు అందుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో దైవాజ్ఞశర్మ, డాక్టర్‌ అందేకర్‌ శ్రీనివాస్‌, డాక్టర్‌ వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement