● సెలవురోజు చూసి
అక్రమంగా మట్టి తరలింపు
● నిద్రావస్థలో రెవెన్యూ, పోలీసు యంత్రాంగం
మానవపాడు: గాంధీ జయంతి సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు కావడాన్ని ఆసరాగా చేసుకొని మట్టి మాఫియా సీలింగ్ ల్యాండ్‌ను తోడేస్తున్నారు. ఈ ఘటన మానవపాడు మండలంలోని బోరవెల్లిలో అక్రమంగా అనుమానాలు లేకుండా రవాణా దందా యథేచ్ఛగా సాగుతోంది. మండలంలోని ప్రభుత్వ సీలింగ్ భూముల్లో నిబంధనలకు విరుద్ధంగా ప్రొక్లెయిన్‌ను దింపి భూమిని ఇస్టారాజ్యంగా తవ్వేస్తున్నారు. ఇక్కడి నుంచి తోడిన మట్టిని పదుల సంఖ్యలో ట్రాక్టర్ల ద్వారా బోరవెల్లికి, అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు దర్జాగా తరలిస్తున్నారు. పగలు, రాత్రి తేడా లేకుండా ట్రిప్పులు, ట్రాక్టర్ల ద్వారా మట్టిని పక్కాదారి పడుతున్నా.. అధికారులు, పోలీసులు కనీసం కన్నెత్తి చూడకపోవడం తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
పట్టించుకోని రెవెన్యూ, పోలీసు యంత్రాంగం
మండలంలో అనుమతులు లేకుండా అక్రమంగా మ ట్టి తవ్వకాలు జరుగుతున్నా నిద్రపోతున్నారా.. రెవె న్యూ, పోలీసు యంత్రాంగమని మండల ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కలెక్టర్ స్పష్టంగా అక్రమంగా మట్టిని తరలించారాదని పదేపదే అధికారులకు సూచిస్తున్నా పట్టించుకోకపోవడానికి కారణం ఏమిటి..? ఎవరో సమాచారం అందిస్తే తప్పా.. అధికారులు, పోలీసు లు ప్రత్యక్షంగా మట్టి తరలింపును నిలిపివేయ డానికి వెళ్లడంలేదని మండల ప్రజలు ఆరోపిస్తున్నారు. చాలాసార్లు మట్టి తరలింపును టిప్పర్లతో పట్టుకున్నా.. వదిలేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.


