● జానంపేట, తాళ్లగడ్డ వద్ద రెచ్చిపోతున్న ఇసుక మాఫియా
● రాత్రయిందంటే చాలు ట్రాక్టర్ల హోరు
●
రాత్రిపూట నిఘా పెంచుతాం
తాళ్లగడ్డ శివారులో ఇసుక అక్రమ రవాణా సాగుతోందన్న సమాచారం మాకు లేదు. రాత్రిపూట వాగు పరిసరాల్లో నిఘా పెంచుతాం. మా సిబ్బందిని పంపించి గస్తీ నిర్వహిస్తాం. ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాం.
– రాజునాయక్, తహసీల్దార్, మూసాపేట
అడ్డాకుల: మూసాపేట మండలంలో ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. రాత్రయిందంటే చాలు ట్రాక్టర్లు, టిప్పర్లతో ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. వారం, పదిరోజులుగా రాత్రిపూట తాళ్లగడ్డ శివారులోని పెద్దవాగులో యాంత్రాలను ఏర్పాటు చేసి ఇసుకను తవ్వుతున్నారు. ట్రాక్టర్లలో ఇసుకను నించి 44వ నంబర్ జాతీయ రహదారి సమీపంలో చక్రాపూర్‌కు వెళ్లే రోడ్డు పక్కన జానంపేట శివారులో ట్రాక్టర్లతో తెచ్చిన ఇసుకను డంపు చేస్తున్నారు. అక్కడ యంత్రాలతో ఇసుకను టిప్పర్లకు నింపి అక్రమంగా తరలిస్తున్నారు. పగలు అక్కడ ఇసుక నిల్వలు కనిపించకుండా జాగ్రత్త పడుతున్నారు. ఈ ఇసుక దందా మొత్తం ‘బంగారంశ్రీలా సాగుతోంది.


